కొత్త పింఛన్‌దారులకు డబ్బు అందజేత

ABN , First Publish Date - 2022-10-04T05:40:45+05:30 IST

కొత్త పింఛన్‌దారులకు డబ్బు అందజేత

కొత్త పింఛన్‌దారులకు డబ్బు అందజేత
అంతారంలో పింఛన్‌ డబ్బు పంపిణీ చేస్తున్న సర్పంచ్‌ రాములు

దోమ/తాండూరు రూరల్‌/మోమిన్‌పేట్‌, అక్టోబరు 3: ప్రభుత్వం కొత్త పింఛన్‌దారులకు నగదును అందజేస్తోంది. సోమవారం పంచాయతీ కార్యాలయాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పింఛన్‌ డబ్బు పంపిణీ చేశారు. దోమలో సర్పంచ్‌ రాజిరెడ్డి నూతన పింఛన్‌దారులకు డబ్బు అందజేశారు. ఉదన్‌రావుపల్లిలో 105 మందికి పింఛన్లు పంపిణీ చేశారు. ఎంపీటీసీ అనిత, లక్ష్మయ్య, యాదయ్యగౌడ్‌ పాల్గొన్నారు. తాండూరు మండలం వీర్‌శెట్టిపల్లిలో సర్పంచ్‌ బిడె నాగప్ప పింఛన్‌ పంపిణీ చేశారు. కొత్తగా 22 పింఛన్లు మంజూరయ్యాయి. అలాగే అంతారంలో 25మంది పింఛన్‌ను సర్పంచ్‌ ఎత్తరి రాములు పంపిణీ చేశారు. అంతారానికి చెందిన కొందరి పింఛన్‌ డబ్బు సాంకేతిక లోపంతో ధారూర్‌ మండలం అంతారానికి బదిలీ అయ్యాయి. విష యం తెలుసుకున్న అధికారులు సర్పంచ్‌కు సమాచారమిచ్చారు. అక్కడి నుంచి డబ్బు తెచ్చి పంపిణీ చేశారు. ఉపసర్పంచ్‌ జీవరత్నం, నాయకులు ప్రకాష్‌, పోస్టుమ్యాన్‌ రోహిత్‌రెడ్డి, అనంత య్య, నర్సింహులు పాల్గొన్నారు. మోమిన్‌పేట్‌ మండలం చిన్నకొల్కుందలో 40మందికి సర్పంచ్‌ల సంఘం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు సర్పంచ్‌ కొనింటి సురేశ్‌ కార్డులు అందజేశారు. నాయకులు సంగన్న, అశోక్‌, సిద్ధప్ప, సంజీవ్‌రెడ్డి, నర్సిములు, రాజ య్య, రాంరెడ్డి, రాములు పాల్గొన్నారు.

Read more