పంచాయతీ కార్మికుల జీతాలివ్వాలి

ABN , First Publish Date - 2022-07-06T05:27:00+05:30 IST

పంచాయతీ కార్మికుల జీతాలివ్వాలి

పంచాయతీ కార్మికుల జీతాలివ్వాలి

  • ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా

బషీరాబాద్‌, జూలై 5 : పంచాయతీ కార్మికుల జీతాలు వెంటనే చెల్లించాలని, నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని సీఐటీయూ ఆధ్వర్యంలో బషీరాబాద్‌ గ్రామ పంచాయతీ కార్మికులు మంగళవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఎమ్మెల్యేలు, మం త్రులు నెలనెలా జీతాలు తీసుకుంటూ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందుల పెడుతున్నరన్నారు. పల్లెప్రగతి కార్యక్రమం పేరిట కార్మికులతో చాకిరి చే యించుకుంటూ.. నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా ని ర్లక్ష్యం చేయడం దారుణమన్నారు. కార్మికులకు వెంటనే జీతాలు ఇవ్వకుంటే యూనియన్‌ ఆధ్వర్యంలో పోరాటం ఉ ధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఎంపీడీవో రమే్‌షకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కార్మికులు శామప్ప, లక్ష్మి, శ్యామల, తదితరులు పాల్గొన్నారు.

Read more