సింహ వాహనంపై పద్మనాభుడు

ABN , First Publish Date - 2022-10-04T05:41:40+05:30 IST

సింహ వాహనంపై పద్మనాభుడు

సింహ వాహనంపై పద్మనాభుడు
సింహ వాహనంపై ఉరేగుతున్న శ్రీ అనంతపద్మనాభ స్వామి

వికారాబాద్‌, అక్టోబరు 3: దసరా ఉత్సవాల్లో భాగంగా ఆలంపల్లిలోని  శ్రీ అనంతపద్మనాభ స్వామి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.  శ్రీ అనంతపద్మనాభ స్వామి సోమవారం సింహా వాహనంపై ఊరేగారు. అర్చకులు ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సాయంత్రం ఆలయ  పురవీధుల్లో స్వామి ని ఊరేగించారు. ఈ వేడుకల్లో పట్టణ రప్రముఖులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.

కనులపండువగా వేంకటేశ్వరస్వామి రథోత్సవం

దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వికారాబాద్‌ పట్టణంలోని వేంకటేశ్వర  దేవాయలంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.ఆలయంలో  స్వామి వారి కల్యాణం అర్చకులు వైభవంగా నిర్వహించారు. సాయంత్రం పట్టణంలో పెద్ద ఎత్తున రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించగా మహిళలు దాండియా ఆడుతూ ర్యాలీలు పాల్గొన్నారు. ఈ వేడుకను చూసేందుకు భక్తులు  భారీగా తరలివచ్చారు.

Read more