అలంపల్లికి పద్మనాభుడు

ABN , First Publish Date - 2022-09-27T04:30:46+05:30 IST

అలంపల్లికి పద్మనాభుడు

అలంపల్లికి పద్మనాభుడు

వికారాబాద్‌, సెప్టెంబరు 26: దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అనంతపద్మనాభ స్వామి సోమవారం ఆలంపల్లి అనంతపద్మనాభ స్వామి దేవాలయానికి చేరుకున్నారు. ఆలయ అర్చకులు, భక్తులు స్వామి వారిని అనంతగిరి నుంచి పల్లకిపై ఊరేగిస్తూ ఆలంపల్లికి తీసుకొచ్చారు. రామయ్యగూడ వద్ద స్వామి వారికి గ్రామస్తులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇదిలా ఉంటే  ఆలంపల్లిలో అనంతపద్మనాభ స్వామి దేవాలయంలో అర్చకులు ధ్వజరోహణం చేసి ఉత్సవాలను ప్రారంభించారు. స్వామి వారు రోజుకో వాహనంపై  ఊరేగి  దసరా రోజు అనంతగిరికి చేరుకోనున్నారు. 

Read more