మన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం

ABN , First Publish Date - 2022-09-10T06:01:09+05:30 IST

మన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం

మన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం
పరిగి : బర్కత్‌పల్లిలో పింఛన్ల ప్రొసీడింగ్స్‌ అందిస్తున్న ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి

దోమ, సెప్టెంబరు 9 : మన రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని పరిగి ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి అన్నారు. దోమ మండల పరిధిలోని బాసుపల్లిలో శుక్రవారం నూనత పింఛన్ల ప్రొసీడింగ్‌ కాపీలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అంతకుముందు గ్రామంలోని వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ ఎన్నో సంక్షమ పథకాలు అమలు చేస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. జడ్పీటీసీ నాగిరెడ్డి, వైస్‌ ఎంపీపీ మల్లేశం, టీఆర్‌ఎస్‌ నాయకుడు రాఘవేందర్‌రెడ్డి, ఎంపీటీసీ, సర్పంచ్‌, ఎంపీడీవో, గ్రామ కార్యదర్శి, తదితరులు పాల్గొన్నారు.

  •  విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలి

పరిగి : విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పరిగి మండలం తుంకులగడ్డలోని  గిరిజన రెసిడెన్షియల్‌ బాలికల పాఠశాలను ఆయన సందర్శించారు. వంటలు, సరుకులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు రోగాల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్‌కు సూచించారు. ఏమైనా ఇబ్బందులుంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. మునిసిపల్‌ చైర్మన్‌ అశోక్‌, ఎంపీసీ అరవింద్‌రావు, ఏఎంసీ చైర్మన్‌ సురేందర్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ భాస్కర్‌, ప్రిన్సిపాల్‌ సుమతి పాల్గొన్నారు.  అలాగే ప్రతీ కుటుంబానికి ప్రభుత్వ పథకాలతో లబ్ధి చేకూరుతోందని, ఆ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఎమ్మెల్యే అన్నారు. పరిగి మండలం బసిరెడ్డిపల్లి, బర్కత్‌పల్లి, రంగాపూర్‌ తదితర గ్రామాల్లో పింఛన్ల ప్రొసీడింగ్‌ కాపీలను లబ్ధిదారులకు అందజేశారు. జడ్పీటీసీ బి.హరిప్రియ, వైస్‌చైర్మన్‌ భాస్కర్‌, ఎంపీడీవో శేషగిరిశర్మ, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు ఆర్‌.అంజనేయులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.


Read more