దుర్గామాతకు అలంకార పూజలు

ABN , First Publish Date - 2022-10-05T05:09:32+05:30 IST

దుర్గామాతకు అలంకార పూజలు

దుర్గామాతకు అలంకార పూజలు
పెద్దేముల్‌ మండలం కందనెల్లిలో కాళికామాత అలంకారంలో అమ్మవారు

శామీర్‌పేట, అక్టోబరు 4: శామీర్‌పేట పరిధి తూంకుంటలోని శ్రీగాయత్రీ మహాక్షేత్రంలో శరన్నవరాత్రోత్సవాలు కన్నుల పండవగా కొనసాగుతున్నాయి. ఆలయ వ్యవస్థాపకులు డాక్టర్‌ ఎస్వీఎల్‌ఎన్‌ మూర్తి ఆధ్వర్యంలో పూజలు జరుగుతున్నాయి. మంగళవారం 9వ రోజు అమ్మవారిని రాజరాజేశ్వరిదేవిగా కొలిచారు. ఉదయం ఉపనిషత్తు పూర్వక అభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకం, హోమం తదితర పూజలు.. సాయంత్రం మహా మంత్రపుష్పం, సహస్రనామ పారాయణం, భాగవత ప్రవచనాలు నిర్వహించారు. 


  • కాళికామాతగా అమ్మవారి దర్శనం

పెద్దేముల్‌: మండలంలోని కందనెల్లిలో అమ్మవారు నిత్యం ఒక ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తున్నారు. మంగళవారం కాళికామాత అవతారంలో అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు.


  • గరుడవాహనంపై అనంతపద్మనాభ స్వామి

వికారాబాద్‌: వికారాబాద్‌లోని ఆలంపల్లి అనంత పద్మనాభస్వామి ఆలయంలో స్వామి వారిని గ రుడ వాహనంపై ఊరేగించారు. గ్రామ పుర వీధుల్లో ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. వెంకటేశ్వర కాలనీలోని వేంకటేశ్వరాలయంలో స్వామి వారికి కల్యాణోత్సవం నిర్వహించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల దంపతులు స్వామి వారికి పట్టు వస్ర్తాలు సమర్పించి పల్లకి మోశారు. కార్యక్రమంలో బీసీ కమిషన్‌ సభ్యులు శుభప్రద్‌పటేల్‌, కౌన్సిలర్లు కిరణ్‌, రామస్వామి, లంక పుష్పలతారెడ్డి, చందర్‌నాయక్‌, నవీన్‌, పావని, సుధాకర్‌రెడ్డి, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. రాత్రి అనంతపద్మనాభస్వామిని హంసవాహనంపై ఊరేగించారు. దసరా రోజు బుధవారం స్వామి వారిని అశ్వవాహనంపై ఉత్సవాల వద్దకు చేరుకొని రావణ దాహనం అనంతరం వికారాబాద్‌లో ఊరేగిస్తారు. వేడుకలకు మున్సిపాలిటీ ఏర్పాట్లు చేసింది.


  • నేడు అశ్వవాహనంపై వేంకటేశ్వరుడి ఊరేగింపు

కొడంగల్‌: దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని కొడంగల్‌లోని వేంకటేశ్వరస్వామిని బుధవారం అశ్వవాహనంపై ఊరేరిగించి భక్తులకు దర్శనం కల్పిస్తామని ధర్మకర్తలు మంగళవారం పేర్కొన్నారు. నేటి సాయంత్రం 4 గంటల నుంచి స్వామివారిని అశ్వవాహనంపై ఊరేగింపు నిర్వహించనున్న ట్లు తెలిపారు. సాయంత్రం 6గంటలకు శమీపూజ(పార్వేట) కార్యక్రమాన్ని చేపడుతామన్నారు. భక్తులు తరలిరావాలని కోరారు. 

  • ఘనంగా సుహాసిని పూజ

ఘట్‌కేసర్‌: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఘట్‌కేసర్‌ బాలాజీనగర్‌లోని వేంకటేశ్వరాలయంలో సుహాసిని పూజను నిర్వహించారు. 9 మంది చిన్నారులకు పూజలు నిర్వహించారు. శివుడికి అభిషేకం, కుంకుమార్చన, లలిత హోమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.


  • మహిశాసురమర్దినిగా అమ్మవారి దర్శనం

ధారూరు: ధారూరు వీరభద్రేశ్వర ఆలయంలో మంగళవారం అమ్మవారు మహిశాసుర మర్దిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మహిళలు భారీ సంఖ్యలో వచ్చి కుంకుమార్చన పూజ నిర్వహించారు.


  • వికారాబాద్‌లో దాండియా సంబరాలు

వికారాబాద్‌: నవరాత్రుల దాండియ సంబరాలను వికారాబాద్‌ బీటీఎస్‌  కాలనీలో నిర్వహించారు. కార్యక్రమాన్ని హైకోర్టు న్యాయవాది రవికకుమార్‌, కాలనీ వాసులు దేవిశ్రీపటేల్‌, దినే్‌షపటేల్‌, ఛాయాదేవి నిర్వహించారు. ఆట పాటలు, కోలాటాల్లో మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Read more