సైబర్‌ నేరగాళ్ల వలలో ఊటుపల్లి వ్యక్తి

ABN , First Publish Date - 2022-08-15T05:34:49+05:30 IST

సైబర్‌ నేరగాళ్ల వలలో ఊటుపల్లి వ్యక్తి

సైబర్‌ నేరగాళ్ల వలలో ఊటుపల్లి వ్యక్తి

  • రూ.19,300 నష్టపోయిన బాధితుడు

దోమ, ఆగస్టు 14 : మండల పరిధిలోని ఊటుపల్లి తండాకు చెందిన రాజేశ్‌ అనే వ్యక్తి సైబర్‌ నేరగాళ్ల మోసానికి బలయ్యాడు. ఈమేరకు వారి మాటలు నమ్మి రూ.19,300 పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. రాజేశ్‌ పార్ట్‌టైం జాబ్‌కోసం గూగుల్‌లో సెర్చ్‌ చేస్తుండగా.. రూ.500 డిపాజిట్‌ చేస్తే రూ.1100 క్యాష్‌బ్యాక్‌ వస్తుందనే ఓ అపరిచిత మెసేజ్‌ చదివాడు. దీంతో వెంటనే అతడు డిపాజిట్‌ చేశాడు. అనంతరం అతడి అకౌంట్‌లోకి రూ.1100 జమయ్యాయి. ఆతర్వాత ఎక్కువ మొత్తంలో డిపాజిట్‌ చేస్తే మరింత లాభం వస్తుందని మెసేజ్‌ రావడంతో రూ.19,300 డిపాజిట్‌ చేశాడు. అనంతరం అవతలి వైపునుంచి లావాదేవీలు నిలిపివేయడంతో నష్టపోయానని తెలుసుకొని ఆదివారం సైబర్‌ క్రైమ్‌ టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై స్థానిక పీఎస్‌లో కూడా ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది.

Read more