కొనసాగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలు

ABN , First Publish Date - 2022-10-03T05:53:56+05:30 IST

కొనసాగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలు

కొనసాగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలు
చేవెళ్ల: శ్రీ లక్షీవెంకటేశ్వర స్వామి వారి ఊరేగింపు

శంషాబాద్‌/చేవెళ్ల/షాబాద్‌/ఆమనగల్లు/కడ్తాల్‌/కందుకూరు/ఇబ్రహీంపట్నం/కొత్తూర్‌, అక్టోబరు 2: శంషాబాద్‌ మున్సిపాలిటీలోని వివిధ బస్తీల్లో ఆదివారం శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్బీనగర్‌, గొల్లపల్లి దర్వాజారోడ్డులోని ఆలయాల్లో ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుష్మారెడ్డిలు ప్రత్యేకపూజలు చేశారు. వారితో పాటు మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ బండిగోపాల్‌యాదవ్‌ ఎస్‌ఎంసీ చైర్మన్‌ వెంకటే్‌షగౌడ్‌, మాజీ సర్పంచ్‌ ఆర్‌. గణేశ్‌గుప్తా, కౌన్సిలర్లు భారతమ్మ, ఆయిల్‌కుమార్‌, స్వర్ణలత బుచ్చిరెడ్డి, అమృతాసుధాకర్‌రెడ్డి జడ్పీటీసీ నీరటి తన్వీరాజు, స్థానిక నాయకులు పాండురంగారెడ్డి, శ్రీనివాస్‌, ప్రభాకర్‌, రాజేందర్‌, ఎం.శ్రీనివాస్‌ పూజల్లో పాల్గొన్నారు. చేవెళ్లలోని రచ్చబండ వద్ద మల్కాపూర్‌, అల్లావాడలో ఎమ్మెల్యే కాలె యాదయ్య ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ లక్ష్మీవేంకటేశ్వర ఆలయంలో స్వామివారి పూజ, సేవా కార్యక్రమాలు కనుల పండువగా జరిగాయి. మహిళలు కోలాటం ఆడారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మాలతికృష్ణారెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా షాబాద్‌ మండలంలోని షాబాద్‌, కుమ్మరిగూడ, మల్లారెడ్డిగూడ, హైతాబాద్‌, తాళ్లపల్లి, సర్దార్‌నగర్‌ గ్రామాల్లో ఏర్పాటు చేసిన మండపాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమనగల్లు పట్టణంలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారు ఆదివారం శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌ యాదవ్‌ ముఖ్య అతిథిగా హాజై ప్రత్యేకపూజలు చేశారు. ఎమ్మెల్యేను ఆలయ నిర్వాహకులు సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ చైర్మన్‌ శ్రీనివా్‌సరెడ్డి, వైస్‌చైర్మన్‌ తోట గిరియాదవ్‌, సీఐ జాల ఉపేందర్‌, రామ్మోహన్‌, నర్సింహ, డాక్టర్‌ వాసు, నాయకులు పాల్గొన్నారు. కడ్తాల మండలం మైసిగండి శివరామాలయాల్లో అమ్మవారు శ్రీ సరస్వతీ దేవి అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ ఫౌండర్‌ట్రస్టీ సిరోలిపంతూ, ఈవో స్నేహలత, తహసీల్దార్‌ ఆర్‌పి.జ్యోతి అరుణ్‌, ఉత్సవ నిర్వాహకుడు రామావత్‌ భాస్కర్‌, సర్పంచ్‌ తులసీరామ్‌ నాయక్‌, ఎంపీపీ కమ్లీమోత్యనాయక్‌, టీపీసీసీ సభ్యుడు శ్రీనివా్‌సగౌడ్‌, మాజీ సర్పంచ్‌ శేఖర్‌గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు. ఆమనగల్లు భక్త మార్కండేయ స్వామి ఆలయంలో ఎమ్మెల్యేతో కలిసి జడ్పీటీసీ అనురాధ పత్యనాయక్‌, మార్కెట్‌ వైస్‌చైర్మన్‌ తోట గిరియాదవ్‌, వైస్‌ చైర్మన్‌ దుర్గయ్య, పద్మశాలి సంఘం అధ్యక్షుడు బాలకృష్ణ, నాయకులు పూజలు చేశారు. అదేవిధంగా కందుకూరు మండలంలోని దాసర్లపల్లి గ్రామంలో దుర్గామాత మండపం వద్ద సర్పంచ్‌ పి.బాలమణిఅశోక్‌ ప్రత్యేక పూజలు చేశారు. ఇబ్రహీంపట్నం మండలంలోని రాయపోల్‌లో టీపీసీసీ కార్యదర్శి దండెం రాంరెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజల్లో కాంగ్రెస్‌ నాయకులు ఈసీ శేఖర్‌గౌడ్‌, త్యాలపల్లి కృష్ణ, రమే్‌షగౌడ్‌, ఎండీ ఖాసీం, శ్యామ్‌ పాల్గొన్నారు. అదేవిధంగా కొత్తూర్‌లోని ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో దుర్గామాత సేవా సమితీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపంలో షాద్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతా్‌పరెడ్డి ప్రత్యేకపూజలు చేశారు. మండపంలో కుంకుమార్చన, సుమంగళి పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. బీజేపీ నాయకులు శ్రీవర్ధన్‌రెడ్డి, అందె బాబయ్య, మిథున్‌రెడ్డి, ఎర్రవెళ్లి నాగరాజుచారి, నర్సింహాగౌడ్‌ పాల్గొన్నారు.   

Updated Date - 2022-10-03T05:53:56+05:30 IST