కొనసాగుతున్న దేవీశరన్నవరాత్రులు

ABN , First Publish Date - 2022-10-01T05:30:00+05:30 IST

కొనసాగుతున్న దేవీశరన్నవరాత్రులు

కొనసాగుతున్న దేవీశరన్నవరాత్రులు
వికారాబాద్‌ : సాకేత్‌నగర్‌లో మహాలక్ష్మి ఆలయంలో దుర్గామాత పల్లకీసేవలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆనంద్‌, కౌన్సిలర్‌ అనంత్‌రెడ్డి, నాయకులు, తదితరులు

వికారాబాద్‌/తాండూరు/ఘట్‌కేసర్‌/శామీర్‌పేట/కులకచర్ల/పరిగి/కొడంగల్‌/ మేడ్చల్‌ అక్టోబరు 1 : దేవిశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తాండూరు పట్టణం నగరేశ్వర దేవాలయంలో 6వ రోజు శనివారం కన్యకాపరమేశ్వరి మాతను కరెన్సీ నోట్లతో మహాలక్ష్మీగా అలంకరించారు. వాసవి మహిళా సంఘం ఆధ్వర్యంలో దాండియా సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. వికారాబాద్‌ పట్టణంలోని సాకేత్‌నగర్‌ మహాలక్ష్మి ఆలయంలో దుర్గామాత పల్లకీసేవలో ఎమ్మెల్యే ఆనంద్‌, కౌన్సిలర్‌ అనంత్‌రెడ్డి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ శివారెడ్డిగూడలో శ్రీదండ్లగడ్డ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయంలో రాజరాజేశ్వరి దేవి అమ్మవారు లక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చింది. పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలోని గాయత్రీ ఆలయంలోని అమ్మవారు మహంకాళి అవతారంలో, పోచారంలోని స్ఫటిక లింగేశ్వరాలయంలోని సర్వమంగళా దేవీ అమ్మవారు మహాలక్ష్మీదేవీ అవతారంలో దర్శనమిచ్చింది. మేడ్చల్‌లోని గడిమైసమ్మ అమ్మవారి శ్రీశ్రీశ్రీ గాయిత్రీదేవి అలంకారణలో భక్తులకు దర్శనమిచ్చారు.  అదేవిధంగా శామీర్‌పేట మండలంలోని శ్రీగాయత్రి మహాక్షేత్రంలో శరన్నవరాత్రోత్సవాలు ఆలయ వ్యవస్థాపకులు డాక్టర్‌ ఎస్‌విఎల్‌ఎన్‌ మూర్తి ఆధ్వర్యంలో వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారిని అన్నపూర్ణదేవిగా దర్శనమిచ్చారు. కులకచర్ల మండలం బండవెల్కిచర్ల పాంబండపై శ్రీమహాలక్ష్మిదేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శణమిచ్చారు.

పరిగిలోని టీచర్స్‌ కాలనీలో గల అమృతాంజనేయస్వామి ఆలయంలో కౌన్సిలర్‌ రవీంద్ర ఆధ్వర్యంలో సామూహిక కంకుమార్చన నిర్వహించారు. పరిగి, పూడూరు జడ్పీటీసీలు బి.హరిప్రియ, మేఘమాలలు పాల్గొన్నారు. పూజల అనంతరం భక్తులకు అన్నదాన చేశారు. కొడంగల్‌ పట్టణంలోని పాత వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఎస్‌ఎ్‌సకే సమాజ్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గమాతకు కుంకుఅర్చన, శతకోటి నామావళి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎ్‌సకే సమాజ్‌ సభ్యులు లొంటే మధు, రంగాపూరి చంద్రకాంత్‌, సూర్తి వెంకటేశ్‌, అంబదాస్‌ తదితరులు పాల్గొన్నారు.


Read more