పాఠశాలను సందర్శించిన అధికారులు

ABN , First Publish Date - 2022-12-13T23:47:09+05:30 IST

పెద్దఎల్కిచర్ల యూపీఎ్‌సలో మూ డోతరగతి బాలిక మంగళవారం పాముకాటుకు గురైంది. ఈ విష యం తెలిసిన వెంటనే తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌, ఎంపీడీవో మహే్‌షబాబు పాఠశాలను సందర్శించారు.

పాఠశాలను సందర్శించిన అధికారులు
పెద్దఎల్కిచర్ల పాఠశాలలో పరిశీలిస్తున్న అధికారులు

చౌదరిగూడ, డిసెంబరు 13: పెద్దఎల్కిచర్ల యూపీఎ్‌సలో మూ డోతరగతి బాలిక మంగళవారం పాముకాటుకు గురైంది. ఈ విష యం తెలిసిన వెంటనే తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌, ఎంపీడీవో మహే్‌షబాబు పాఠశాలను సందర్శించారు. విద్యార్థినికి పాము కాటు ఎలా వేసిందనే విషయంపై వివరాలు తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణలో లోపించిన పారిశుధ్యాన్ని, టాయిలెట్స్‌, మురుగునీరు పేరుకుపోవడాన్ని గుర్తించారు. స్కూలు ఆవరణను వెంటనే సరిచేయించాలని హెచ్‌ఎంకు వారు సూచించారు.

Updated Date - 2022-12-13T23:47:09+05:30 IST

Read more