నట్టల నివారణ మందులు వేయించాలి

ABN , First Publish Date - 2022-06-08T05:17:22+05:30 IST

నట్టల నివారణ మందులు వేయించాలి

నట్టల నివారణ మందులు వేయించాలి

ఇబ్రహీంపట్నం రూరల్‌/చేవెళ్ల/కందుకూరు/మాడ్గుల, జూన్‌ 7: ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న నట్టల నివారణ మందులను గొర్రెలు, మేకలకు వేయించాలని ఇబ్రహీంపట్నం ఎంపీపీ పి.కృపేష్‌ అన్నారు. మండలంలోని ఉప్పరిగూడ గ్రామంలో మంగళవారం సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు బూడిదరాంరెడ్డితో కలిసి నట్టల నివారణ మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో క్రాంతికిరణ్‌, డాక్టర్‌ సురేందర్‌, ప్రసున్న, నర్సింహారెడ్డి, రిషికనేత, పాల్గొన్నారు. చేవెళ్ల మండలంలో బుధవారం(నేడు) నుంచి ఈనెల 17వ తేదీ వరకు గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు ఇవ్వనున్నట్లు చేవెళ్ల మండల పశువైద్యాధికారి శిరీష మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా కందుకూరులో నేటి నుంచి ఈనెల 14 వరకు నట్టల నివారణ మందులను పంపిణీ చేయనున్నట్లు మండల పశువైద్యాధికారి డాక్టర్‌ రేవతి తెలిపారు. అదేవిధంగా మాడ్గులలో నేటి నుంచి ఈనెల 16వ తేదీ వరకు నట్టల నివారణ మందులను పంపిణీ చేయనున్నట్లు పశువైద్యాధికారి డాక్టర్‌ శేఖర్‌ తెలిపారు.  

Read more