మంత్రి హరీశ్‌రావుకు ఘన స్వాగతం

ABN , First Publish Date - 2022-09-10T05:57:33+05:30 IST

మంత్రి హరీశ్‌రావుకు ఘన స్వాగతం

మంత్రి హరీశ్‌రావుకు ఘన స్వాగతం

వికారాబాద్‌, సెప్టెంబరు 9 : తాండూరు పర్యటనలో భాగంగా వికారాబాద్‌ మీదుగా వెళుతున్న మంత్రి హరీశ్‌రావుకు వికారాబాద్‌ టీఆర్‌ఎస్‌ నాయకులు శుక్రవారం స్వాగతం పలికారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద కాన్వాయ్‌ని ఆపడంతో టీఆర్‌ఎస్‌ నాయకుడు లక్ష్మీకాంత్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డితో పాటు నాయకులు మంత్రిని శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రితో ఎంపీ రంజిత్‌రెడ్డి కూడా ఉన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు అనంత్‌రెడ్డి, నవీన్‌, నాయకులు విజయ్‌కుమార్‌, శ్రీనివా్‌సగౌడ్‌, రమేష్‌గౌడ్‌, రాజమల్లు, షకీల్‌ ఈశ్వర్‌, జొన్నల రవిశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.


Read more