ఆలయ అభివృద్ధికి సహకరించాలి

ABN , First Publish Date - 2022-09-08T05:44:20+05:30 IST

ఆలయ అభివృద్ధికి సహకరించాలి

ఆలయ అభివృద్ధికి సహకరించాలి
కీసరగుట్టపై వసతి గృహాల పనులకు శంకుస్థాపన చేస్తున్న ఆలయ చైర్మన్‌ తటాకం ఉమాపతిశర్మ

కీసర, సెప్టెంబరు 7 : సుప్రసిద్ధ శైవ క్షేత్రమైన కీసరగుట్ట ఆలయ అభివృద్ధికి దాతలు సహకరించాలని ఆలయ చైర్మన్‌ తటాకం ఉమాపతి శర్మ అన్నారు. బుధవారం క్షేత్రంపై వసతిగృహాల భవన నిర్మాణాల కోసం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ దాతల సహకారంతో వసతిగృహాలు నిర్మిస్తున్నామన్నారు. దాత శ్రీనివాస్‌ నిర్మించిన ఆలయ పరిపాలన భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈవో సుధాకర్‌రెడ్డి, ట్రస్ట్‌ బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. Read more