తులంన్నర బంగారం, డబ్బులు చోరీ

ABN , First Publish Date - 2022-08-31T06:08:52+05:30 IST

తులంన్నర బంగారం, డబ్బులు చోరీ

తులంన్నర బంగారం, డబ్బులు చోరీ

కొడంగల్‌ రూరల్‌, ఆగస్టు 30 : టిఫిన్‌ సెంటర్‌ నిర్వహించేందుకు ఇల్లుకు తాళం వేసి వెళ్లగా.. దుండగులు తాళం పగులగొట్టి చోరీకి పాల్పడిన ఘటన కొడంగల్‌ మండలం పెద్దనందిగామ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రవి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఈడ్గి బందయ్యగౌడ్‌, వెంకటమ్మ దంపతులు గ్రామంలో టిఫిన్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నారు. రోజూ మాదిరిగానే మంగళవారం ఉదయం 5 గంటలకు ఇంటికి తాళం వేసి టిఫిన్‌ సెంటర్‌ వద్దకు వెళ్లారు. మధ్యాహ్నం వారి కుమారుడు ఇంటికి వెళ్లి చూడగా.. అప్పటికే తాళం పగలగొట్టి ఉండటాన్ని గమనించాడు. ఇంట్లోకి వెళ్లిచూడగా బంగారం, డబ్బు దాచిపెట్టిన పెట్టె తాళం కూడా పగలగొట్టి ఉంది. దీంతో తండ్రికి సమాచారం ఇవ్వడంతో ఇంటికి వచ్చి పరిశీలించగా తులంన్నర బంగారం, డబ్బులు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బందయ్యగౌడ్‌ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు. 

 మోత్కూర్‌ కట్టమైసమ్మ ఆలయంలో హుండీ..

దోమ, ఆగస్టు 30 : మండల పరిధిలోని మోత్కూర్‌ కట్టమైసమ్మ ఆలయంలో సోమవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు హుండీ ఎత్తుకెళ్లారు. మంగళవారం ఉదయం భక్తుడు శ్రీకాంత్‌రావు గమ నించగా.. ఆలయం తలుపులు విరగ్గొట్టి హుండీ దొంగిలించినట్లు గమనించాడు. దీంతో పోలీ్‌సలకు సమాచారం అందించగా.. హుండీలో రూ.70 వేల వరకు నగదు ఉంటుందని శ్రీకాంత్‌ పోలీ్‌సలకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విశ్వజన్‌ తెలిపారు.

గోగ్యానాయక్‌ తండా మైసమ్మ గుడిలో..

కులకచర్ల, ఆగస్టు 30 : మండల పరిధిలోని గోగ్యానాయక్‌ తండాలో గల మైసమ్మ గుడిలో సోమవారం రాత్రి దొంగతనం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు గుడి తాళాలు పగలగొట్టి అమ్మవారి వెండి కిరీటం, ఇతర బంగారు వస్తువులు దొంగిలించుకుపోయారు. మంగళవారం ఉదయం తండా ప్రజలు గమనించారు. దొంగిలించిన వస్తువుల విలువ దాదాపు రూ.25వేలు ఉంటుందని, తండా ప్రజలు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గిరి చెప్పారు.

Read more