తాండూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతన కోర్సులు

ABN , First Publish Date - 2022-07-05T05:30:00+05:30 IST

తాండూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతన కోర్సులు

తాండూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతన కోర్సులు

తాండూరు, జూలై 5 : తాండూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతన  కోర్సులను ప్రవేశపెట్టారు. ఈమేరకు బీఎస్సీ(ఫిజికల్‌సైన్స్‌), బీఎస్సీ(లైఫ్‌ సైన్సెస్‌), బీకాం కంప్యూటర్‌ అప్లికేషన్‌, బీఏ(కంప్యూటర్‌ అప్లికేషన్‌), బీఏ(మాస్‌ కమ్యూనికేషన్‌ మరియు జర్నలిజం), బీఏ(సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, సైకాలజీ, జియోగ్రఫీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌) వంటి కోర్సులను ప్రారంభించినట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం.రవీందర్‌ తెలిపారు. కాగా, ఈ కోర్సులకు సంబంధించిన పోస్టర్‌ను మంగళవారం కళాశాలలో అధ్యాపకులతో కలిసి ఆవిష్కరించారు.

  • కళాశాలలో అత్యాధునిక డిజిటల్‌ ల్యాబ్‌ సౌకర్యం

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వర్చువల్‌ తరగతులు, హైస్పీడ్‌ ఇంటర్‌ నెట్‌ సౌకర్యం, హై స్పీడ్‌ నెట్‌వర్క్‌ కలిగిన కంప్యూటర్‌ ల్యాబ్‌ సౌకర్యం, అన్ని సబ్జెక్టులకు సంబంధించి అత్యాధునిక ప్రయోగశాలలు, స్పోర్ట్స్‌ రూం సౌకర్యం, ఆన్‌లైన్‌ వెబినార్‌, సెమినార్‌, మూక్స్‌ కోర్సును బోధించేందుకు వర్చువల్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేయడం జరిగిందని ప్రిన్సిపాల్‌ తెలిపారు.

  • జిల్లా స్థాయి సహాయక కేంద్రం ప్రారంభం

2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి దోస్త్‌ ప్రకటన వెలువడినట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం.రవీందర్‌ తెలిపారు. ఈమేరకు కళాశాలలో జిల్లా స్థాయి సహాయ కేంద్రాన్ని ప్రిన్సిపాల్‌ ప్రారంభించారు. డిగ్రీలో చేరడానికి ఆన్‌లైన్‌లో ప్రవేశాలు పొందే విద్యార్థులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కళాశాల దోస్త్‌ సమన్వయ కర్త ఎస్‌.మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ సహాయక కేంద్రం ద్వారా ప్రవేశం సలువుగా ఉంటుందన్నారు. పేర్ల నమోదు, ఆధార్‌ ధ్రువీకరణ, వెబ్‌ఆప్షన్‌ నమోదు తదితర సేవలు పొందవచ్చన్నారు. అధ్యాపకులు డాక్టర్‌ వివేక్‌కుమార్‌ దుబే, డాక్టర్‌ ఆశ్ర రూరల్‌ హక్‌, కిషన్‌, రాంగోపాల్‌రెడ్డి, డాక్టర్‌ మాధవి, కళావతి, లక్ష్మణ్‌, సంగమేశ్వర్‌ తదితరులున్నారు.

Updated Date - 2022-07-05T05:30:00+05:30 IST