ఎన్‌సీడీ కిట్లను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-12-06T23:54:38+05:30 IST

రక్తపోటు ఉన్నవారు ఎన్‌సీడీ కిట్లను సద్వినియోగం చేసుకోవాలని మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న అన్నారు.

ఎన్‌సీడీ కిట్లను సద్వినియోగం చేసుకోవాలి

తాండూరు/తాండూరు రూరల్‌/యాలాల/దోమ/కులకచర్ల, డిసెంబరు 6 : రక్తపోటు ఉన్నవారు ఎన్‌సీడీ కిట్లను సద్వినియోగం చేసుకోవాలని మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న అన్నారు. తాండూరు పట్టణం ఇందిరానగర్‌ బస్తీ దవాఖానాలో బీసీ, షుగర్‌ ఉన్న వారికి మెడిసిన్‌ కిట్లను చైర్‌పర్సన్‌ అందజేశారు. కౌన్సిలర్లు రజాక్‌, బోయ రవిరాజు తదితరులున్నారు. అదేవిధంగా ఉన్నతమైన జీవనానికై ఆరోగ్యకరమైన అలవాట్ల కోసం ప్రభుత్వం మరో సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టిందని తాండూరు జడ్పీటీసీ మంజుల అన్నారు. మంగళవారం తాండూరు మండలం జినుగుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైస్‌ ఎంపీపీ స్వరూప ఆధ్వర్యంలో ఎన్‌సీడీ మెడిసిన్‌ కిట్లను గ్రామస్తులకు అందజేశారు. ఉపసర్పంచ్‌ ఆసిఫ్‌, చెంగోల్‌ మాజీ ఎంపీటీసీ గౌడి వెంకటేశం, ఏఎన్‌ఎంలు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. యాలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంపీపీ బాలేశ్వర్‌గుప్తా బీసీ, షుగర్‌ ఉన్నవారికి మెడిసిన్‌ కిట్లను అందజేశారు. త్వరలోనే కంటి చికిత్సలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నట్లు ఎంపీపీ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రాములు, జుంటుపల్లి సర్పంచ్‌ వెంకట్‌రెడ్డి, ఆసుపత్రి సిబ్బంది విజయ, గోపాలకృష్ణ, బసయ్యగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా దోమ మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో ఎంపీపీ అనసూయ, జడ్పీటీసీ నాగిరెడ్డిలు బీపీ, షుగర్‌ వ్యాధిగ్రస్తులకు ఎన్‌సీడీ కిట్లను అందించారు. వైస్‌ ఎంపీపీ మల్లేశం, సర్పంచ్‌ రాజిరెడ్డి, తదితరులున్నారు. ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందా్‌సనాయక్‌లు కులకచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో 30 ఏళ్లు పైబడిన వారికి మెడిసిన్‌ కిట్లు పంపిణీ చేశారు.

Updated Date - 2022-12-06T23:54:39+05:30 IST