నవరాత్రోత్సవాలను ఘనంగా జరుపుకోవాలి

ABN , First Publish Date - 2022-08-31T06:04:27+05:30 IST

నవరాత్రోత్సవాలను ఘనంగా జరుపుకోవాలి

నవరాత్రోత్సవాలను ఘనంగా జరుపుకోవాలి
పరిగి : జడ్పీటీసీ మేఘమాల నివాసంలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి

  • ప్రజాప్రతినిధులు, నాయకులు 
  • వినాయక చవితి పురస్కరించుకొని మట్టి గణనాథుల విగ్రహాలు పంపిణీ
  • మండపాల వద్ద జోరుగా ఏర్పాట్లు 
  • నిమజ్జన స్థలాలను పరిశీలించిన అధికారులు

వికారాబాద్‌/పరిగి/తాండూరు/యాలాల/మేడ్చల్‌/ఘట్‌కేసర్‌/ఘట్‌కేసర్‌ రూరల్‌/కీసర/శామీర్‌పేట, ఆగస్టు 30 : గణేశ్‌ నవరాత్రోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు అన్నారు. వినాయక చవితిని పురస్కరించుకొని మంగళవారం వికారాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లో భక్తులు దుకాణాల్లో వినాయక విగ్రహాలను కొనుగోలు చేశారు. గ్రామాలు, పట్టణాలతోపాటు ఆయా కాలనీలకు బొజ్జగణపయ్య విగ్రహాలను తరలించారు. హైదరాబాద్‌, సంగారెడ్డి, వికారాబాద్‌ ప్రాంతాల్లో కొనుగోలు చేసిన భారీ విగ్రహాలతో పాటు మట్టి వినాయకులను సైతం పలువురు కొనుగోలు చేశారు. కాగా, మట్టి వినాయకులనే ప్రతిష్ఠించాలని జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు హిందు ఉత్సవ సమితీలు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వికారాబాద్‌ జిల్లా ప్రజలకు చవితి శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే మట్టి వినాయకులనే ప్రతిష్ఠించాలని పరిగి ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి అన్నారు. జడ్పీటీసీ మేఘమాలా ప్రభాకర్‌గుప్త ఆధ్వర్యంలో పరిగిలోని ఆమె స్వగృహంలో ఉచితంగా మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘమాలను అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉత్సవాలను వైభవంగా జరుపుకోవాలన్నారు. డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డి, పరిగి, పూడూరు జడ్పీటీసీలు బి.హరిప్రియ, మేఘమాల, మునిసిపల్‌ చైర్మన్‌ అశోక్‌, ఏఎంసీ చైర్మన్‌ సురేందర్‌, వైఎ్‌సచైర్మన్‌ ఎస్‌.భాస్కర్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు ఆంజనేయులు, మాజీ అధ్యక్షుడు బి.ప్రవీణ్‌రెడ్డి, నాయకులు కంకల్‌ ప్రభాకర్‌, కావలి లక్ష్మి, వార్ల రవీంద్ర, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు. ప్రతీ ఒక్కరు మట్టి గణనాథులను ఏర్పాటుచేసి పూజించాలని వికారాబాద్‌ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులా రమేష్‌ పేర్కొన్నారు.

వికారాబాద్‌లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఆ సంఘం అధ్యక్షుడు మాలే లక్ష్మణ్‌, మునిసిపల్‌ మాజీ చైర్‌ పర్సన్‌ సత్యనారాయణ, మాజీ వైస్‌చైర్మన్‌ రమేష్‌ కుమార్‌, ఆర్యవైశ్య సంఘం మాజీ నాయకులు విజయ్‌, దోమ శ్రీకాంత్‌, రఘునందన్‌, మహిళలు, సారపు శైలజ, సారపు అరుణ, కుంచం దీప, పోకల సతీష్‌, మోముల రాజ్‌కుమార్‌, పెండ్యాల రవి, మ్యాడం దత్తు, అల్లెంకల వెంకటేశం, శ్రీ రాములు, లగిశెట్టి రాకేశ్‌, మోముల సంతోష్‌, సారపు సాయి కృష్ణ, చైతన్య గుప్త, విక్రమ్‌, కల్వ వెంకటేశ్‌, సందీప్‌, సాయి, శ్రీనివాస్‌, సంఘం పెద్దలు నాయకులు యువకులు పాల్గొన్నారు. అలాగే పర్యవరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి గణనాథులను ప్రతిష్ఠించి పూజించాలని, మట్టి గణనాథుల పూజతో మోక్షం ఉంటుందని భృంగీ కళాశాల కరస్పాండెంట్‌ డాక్టర్‌ చంద్రప్రియ పేర్కొన్నారు.

వికారాబాద్‌ పట్టణంలోని కళాశాలలో మట్టి వినాయకులను పంపిణీ చేశారు. కళాశాల డైరెక్టర్‌ శివప్రసాద్‌, ప్రిన్సిపాల్‌ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాగా, వినాయక నిమజ్జనానికి యాలాల మండల పరిధిలోని కోకట్‌ కాగ్నా నదిని తాండూరు డీఎస్పీ శేఖర్‌గౌడ్‌ పరిశీలించారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ సుశీల్‌కుమార్‌ గౌడ్‌, హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింహులుతో కలిసి నది వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. తాండూరు రూరల్‌ సీఐ రాంబాబు, యాలాల ఎస్‌ఐ అరవింద్‌, హిందూ ఉత్సవ సమితి సభ్యులు, కోకట్‌ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. 

  • పదేళ్లుగా మట్టి వినాయకుడి తయారీ 

వినాయక చవితిని పురస్కరించుకుని తాండూరు మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ కోట్రిక విజయలక్ష్మి మట్టి వినాయకుడిని తయారు చేశారు. గత పదేళ్లుగా తాను మట్టి వినాయకుడిని తయారు చేస్తున్నానని ఆమె తెలిపారు. పర్యావరణ రక్షణకు మట్టి వినాయకుడినే పూజించాలని కోరారు. 

  • మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా పరిధిలో..

పర్యావరణానికి మేలు చేసే మట్టి వినాయక ప్రతిమలనే పూజించాలని బీజేపీ మేడ్చల్‌ జిల్లా నాయకులు కాలేరు రామోజీ తెలిపా రు. ఘట్‌కేసర్‌ మండలం ఎదులాబాద్‌లో బోడుప్పల్‌కు చెందిన శ్రీ శంకర విద్యాభారతీ గోరక్ష సంరక్షణ చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఆవుపేడతో తయారుచేసి రంగులద్దిన వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. సాల్వేరు రఘు, ఆంజనేయులు, శంకర్‌, లింగం, ఏడుకొండల్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. లయన్స్‌ క్లబ్‌ హైద్రాబాద్‌ సంజీవిని ఆధ్వర్యంలో ఎదులాబాద్‌లో మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో లయన్స్‌క్లబ్‌ ప్రతినిధి ఓరి బాల వెంకటనారాయణ, శ్రీనివాస్‌, ప్రసాద్‌, సురేష్‌, సాయి హర్షవర్దన్‌ తదితరులు పాల్గొన్నారు.

నేడు వినాయక చవితిని పురస్కరించుకుని మేడ్చల్‌ మార్కెట్‌  సందడిగా మారింది. వినాయక విగ్రహాలు, పూజా సామగ్రిని కొనుగోలు చేసే భక్తులతో మార్కెట్‌ రోడ్డు జనాలతో కిక్కిరిసి పోయింది. పట్టణంలోని వివేకానంద విగ్రహం నుంచి పాత మార్కెట్‌ రోడ్డు పూర్తిగా ప్రజలతో కిక్కిరిసి పోయింది. ఇన్‌స్పెక్టర్‌ సుధీర్‌కుమార్‌ శామీర్‌పేట పోలీసుస్టేషన్‌లో ఉత్సవాల ఆర్గనైజర్లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులతో శాంతి సమావేశాన్ని నిర్వహించారు. ఎస్‌ఐలు మునిందర్‌, శేఖర్‌, తదితరులు పాల్గొన్నారు. ఘట్‌కేసర్‌, పోచారం మున్సిపాలిటీల పరిధిలో వాడవాడలా వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. కాగా, నిర్వాహకులు రెండు రోజులుగా భారీ వినాయక విగ్రహాల కొనుగోలు కోసం నగరంలోని దూల్‌పేట్‌కు వెళ్లి విగ్రహలను కొనుగోలు చేశారు. తక్కువ ఎత్తు గల విగ్రహాలను ఘట్‌కేసర్‌, అన్నోజిగూడ, నారపల్లి, జోడిమెట్ల. ఉప్పల్‌, నాగోల్‌ నుంచి తెచ్చుకుంటున్నారు.

ఘట్‌కేసర్‌, పోచారం మున్సిపాలిటీల్లో పలుచోట్ల ఆకర్షణీయమైన సెట్టింగులతో మండపాలు నిర్మించారు. ప్రతీఒక్కరు మట్టి వినాయకులనే పూజించాలని నాగారం మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రారెడ్డి అన్నారు. 6, 8వ వార్డు కౌన్సిలర్లు ఆనంత్‌రెడ్డి, మమతా కృష్ణారెడి ఆధ్వర్యంలో చైర్మన్‌ కాలనీవాసులకు ఉచితంగా మట్టి వినాయకులను పంపిణీ చేశారు. శామీర్‌పేట పెద్ద చెరువు వద్ద ఎలాంటి లోటుపాట్లు లేకుండా వినాయక నిమజ్జన ఘాట్‌ ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని మేడ్చల్‌ అదనపు కలెక్టర్‌ జాన్‌శ్యాంసన్‌ అధికారులకు సూచించారు. ఇరిగేషన్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న నిమజ్జనం ఘాట్‌ ఏర్పాట్లను పరిశీలించి ఏర్పాట్లపై సూచనలు చేశారు. డీపీవో రమణమూర్తి, డీఈఈ సురేష్‌, ఎంపీపీ ఎల్లుబాయి, తూంకుంట మున్సిపల్‌ చైర్మన్‌ రాజేశ్వర్‌రావు, వైస్‌చైర్మన్‌ వీరారెడ్డి, కమిషనర్‌ జైతురాంనాయక్‌, తహసీల్దార్‌ సురేందర్‌, ఇన్‌స్పెక్టర్‌ సుధీర్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు సుదర్శన్‌, తదితరులు పాల్గొన్నారు.

Read more