బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యం

ABN , First Publish Date - 2022-08-31T05:50:02+05:30 IST

బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యం

బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యం
మాట్లాడుతున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

చేవెళ్ల/షాబాద్‌, ఆగస్టు 30: బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యమని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. మంగళవారం బీజేవైఎం ఆధ్వర్యంలో చేవెళ్ల, షాబాద్‌లలో ఏర్పాటు సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వస్తామని దీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం పార్టీని ప్రజలకు చేరువ చేయాల్సిన బాధ్యత ప్రతీ కార్యకర్తపై ఉందన్నారు. సర్దార్‌నగర్‌ గ్రామానికి చెందిన మర్పల్లి విష్ణుకు బీజేవైఎం కార్యవర్గ సభ్యుడిగా నియామకపత్రాన్ని అందజేశారు. ఈకార్యక్రమంలోయాదేశ్‌, రాము, పత్తి సత్యనారాయణ, శ్రీనివా్‌సరెడ్డి, మహేందర్‌, నాయకులు మహేష్‌, రాఘు తదితరులు పాల్గొన్నారు. 

Read more