నేడు శామీర్‌పేటలో జాతీయ అప్రెంటీస్‌ మేళా

ABN , First Publish Date - 2022-09-12T05:06:48+05:30 IST

నేడు శామీర్‌పేటలో జాతీయ అప్రెంటీస్‌ మేళా

నేడు శామీర్‌పేటలో జాతీయ అప్రెంటీస్‌ మేళా

మేడ్చల్‌అర్బన్‌, సెప్టెంబరు 11: ప్రధానమంత్రి జాతీయ అప్రెంటీస్‌మేళాను ఈనెల 12న సోమవారం శామీర్‌       పేటలో నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎంవై నిర్మల ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు ఈ మేళా ప్రారంభమవుతుందన్నారు. ఐటీఐలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు జ్ట్టిఞట://్చఞఞట్ఛుఽ్టజీఛ్ఛిటజిజీఞ. జీుఽఛీజ్చీ. ౌటజ.జీుఽ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌  రిజిస్ర్టేషన్‌ చేసుకోవాలని సూచించారు. ఈ మేళాలో వివిధ మల్టీనేషనల్‌  కంపెనీలకు చెందిన  ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. అర్హులైన వారందరూ ఈ అప్రెంటీస్‌ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. అలాగే  మరిన్ని  వివరాలకు 9346397755, 9494140280 నెంబర్లలో సంప్రదించాలన్నారు.

Read more