క్రమశిక్షణతో ఉన్నతస్థాయికి ఎదగాలి

ABN , First Publish Date - 2022-03-17T04:55:49+05:30 IST

క్రమశిక్షణతో ఉన్నతస్థాయికి ఎదగాలి

క్రమశిక్షణతో ఉన్నతస్థాయికి ఎదగాలి

ఆమనగల్లు, మార్చి 16: విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నతస్థాయికి ఎదగాలని ఆమనగల్లు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ అనసూయ అన్నారు. ఆమనగల్లు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో బుధవారం ఇంటర్‌ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.  కార్యక్రమంలో అధ్యాపకులు సురేశ్‌, మధుకర్‌, శ్రీదేవి, జైపాల్‌, వెంకటయ్య, కృష్ణయ్య, శ్రీనివాస్‌, అలివేలు, వెంకటలక్ష్మి, శ్రీనివాస్‌, సత్యం, కిరణ్‌కుమార్‌ పాల్గొన్నారు. 

Read more