టెట్‌ను పకడ్బందీగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-06-07T05:30:00+05:30 IST

టెట్‌ను పకడ్బందీగా నిర్వహించాలి

టెట్‌ను పకడ్బందీగా నిర్వహించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ నిఖిల

వికారాబాద్‌, జూన్‌ 7: టీచర్స్‌ ఎలిజిబు లిటీటె్‌స్ట(టెట్‌)కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని వికారాబాద్‌ కలెక్టర్‌ నిఖిల అధికారులకు సూచించా రు. మంగళవారం మద్గుల్‌ చిట్టంపల్లి డీపీఆర్సీలో టెట్‌పై చీఫ్‌ సూపరింటెండెంట్‌, విద్యా శాఖఅధికారుల తో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. అభ్యర్థు ల భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి ఎలాంటి పొరపాట్లు లేకుండా పరీక్ష నిర్వహించాలన్నారు. ఏమైనా సమస్యలుంటే డీఈవోకు లేదా తనకు తెలియజేయాలన్నారు. జిల్లాలో 24 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, ప్రతీ సెంటర్‌లో 240మంది చొప్పున పరీక్ష రాస్తారన్నారు. ఈ నెల 12న ఉదయం 9:30నుంచి మధ్యాహ్నం 12.30వరకు నిర్వహించే పేపర్‌-1కు 5,740 మంది, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహించే పేపర్‌-2కు 3,745 మంది అభ్యర్థులు హాజరవుతారని కలెక్టర్‌ తెలిపారు. పరీక్ష సమయానికి అభ్యర్థులు నిమిషం ఆలస్యమైనా సెంటర్లోకి అనుమతించం అన్నారు. సమావేశంలో డీఈవో రేణుకాదేవి, ఏసీజీఈ ప్రభు, ఏడీ ఘని, డీసీఏబీ కార్యదర్శి అనంత్‌రెడ్డి, తహసీల్దార్లు, ఎంఈవోలు పాల్గొన్నారు.


  • టెట్‌పై నిర్వహణపై మేడ్చల్‌ ఇన్‌చార్జి కలెక్టర్‌ సమీక్ష

మేడ్చల్‌, జూన్‌ 7(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మేడ్చల్‌ జిల్లాలో ఈ నెల 12న టెట్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తిచేయాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ హరీష్‌ యంత్రాంగాన్ని ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో అధికారులతో క లెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 26 కేంద్రాలను ఏర్పాటు చేశామ న్నారు. పేపర్‌-1కు 6,968 మంది, పేపర్‌-2కు 5,915 మంది హాజరుకానున్నారని తెలిపారు. పరీక్షల నిర్వహణకు 72 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 72 మంది డిపార్ట్‌మెంటల్‌ అధికారులను నియమించామన్నారు. 28 మందిని రూట్‌ అధికారులుగా, ఫ్లయింగ్‌ స్క్వాడ్లను నియమించామన్నారు. 165 మంది, 650 మంది ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. అభ్యర్థులు పరీక్ష సమయానికి నిమిషం ఆలస్యమైనా సెంటర్‌లోకి అనుమతించరని చెప్పారు. ఎండల నేపథ్యంలో పరీక్షలు రాసేవారికి, ఎగ్జామినేషన్‌ సిబ్బందికి తగిన సౌకర్యాలను విద్యా, రెవెన్యూ శాఖలు కల్పించాలని హరీశ్‌ ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో డీఈవో విజయకుమారి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-07T05:30:00+05:30 IST