మున్సిపల్‌ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి

ABN , First Publish Date - 2022-12-13T23:22:55+05:30 IST

మున్సిపల్‌ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు డిమాండ్‌ చేశారు.

మున్సిపల్‌ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి
ఆందోళన చేస్తున్న కార్మికులు

రంగారెడ్డి అర్బన్‌, డిసెంబరు 13 : మున్సిపల్‌ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. సమస్యలను పరిష్కరించాలని కార్మికులు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. అనం తరం జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కార్మికులకు దళితబంధు, డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లు కేటాయించాలని, ఏపీలో ఇస్తున్నట్లు రూ.21 వేయి జీతం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్మికులకు 8 గంటల పని విధానం అమలు చేయాలని, పెండింగ్‌ వేతనాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.భాస్కర్‌, జిల్లా అధ్యక్షులు జి. యాదగిరి, జిల్లా కార్యదర్శి డి.కిషన్‌, ఎన్‌.రాజు, చంద్రమోన్‌, బుగ్గరాములు, ఎల్లేష్‌, నర్సింహ, రుద్రకుమార్‌, ఎ.రవి, ఎన్‌.మల్లే్‌ష, డి.బాబు, యాదగిరి, మైసయ్య, వెంకటేష్‌, రవి, హంసమ్మ, లక్ష్మయ్య, నవీన్‌, బాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T23:22:56+05:30 IST