ట్రాక్టర్‌ పైనుంచి కిందపడి మహిళ మృతి

ABN , First Publish Date - 2022-10-15T05:08:30+05:30 IST

ట్రాక్టర్‌ పైనుంచి కిందపడి మహిళ మృతి

ట్రాక్టర్‌ పైనుంచి కిందపడి మహిళ మృతి

దోమ, అక్టోబరు 14 : ట్రాక్టర్‌ పైనుంచి కిందపడి ఓ మహిళ మృతి చెందిన ఘటన దోమ మండలం ఐనాపూర్‌ గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఐనాపూర్‌కు చెందిన పిట్ల అంజిలమ్మ(52) అదే గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో కూలీకి వెళ్లింది. పనులు ముగించుకొని సాయంత్రం ట్రాక్టర్‌పై గ్రామానికి వస్తుండగా.. గ్రామ శివారులో ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌పై నుంచి కిందపడింది. ఈ సంఘటనలో ఆమెకు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తోటి కూలీలు పరిగి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పిట్ల అంజిలమ్మ మృతిచెందింది. 


Read more