ఆటాపాటలతో బతుకమ్మ సంబురాలు

ABN , First Publish Date - 2022-10-01T05:30:00+05:30 IST

ఆటాపాటలతో బతుకమ్మ సంబురాలు

ఆటాపాటలతో బతుకమ్మ సంబురాలు
బషీరాబాద్‌ : బతుకమ్మ పూజలో పాల్గొన్న ఎంపీపీ కరుణ, వైస్‌ ఎంపీపీ అన్నపూర్ణ తదితరులు

వికారాబాద్‌/తాండూరు రూరల్‌/పెద్దేముల్‌/బషీరాబాద్‌/కొడంగల్‌ రూరల్‌/కులకచర్ల/ఘట్‌కేసర్‌/కీసర, అక్టోబరు 1: మహిళలు, యువతులు, చిన్నారులు ఆటపాటలతో బతుకమ్మ ఆడారు. వికారాబాద్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సురేశ్వరస్వామి ఆధ్వర్యంలో విద్యార్థులు, అధ్యాపకులు కళాశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తాండూరు మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ అనితాగౌడ్‌, వైస్‌ఎంపీపీ స్వరూప, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్‌వాడీ టీచర్లు, ఐకేపీ సిబ్బంది బతుకమ్మ ఆడిపాడారు. ఈ సందర్భంగా పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. ఎల్మకన్నె పీఏసీఎస్‌ చైర్మన్‌ రవీందర్‌గౌడ్‌, ఎంపీడీవో సుదర్శన్‌రెడ్డి, ఎంఈవో వెంకటయ్యగౌడ్‌, సర్పంచ్‌లు పాల్గొన్నారు. పెద్దేముల్‌ మండల కేంద్రంలో జరిగిన బతుకమ్మ సంబరాల్లో ఎంపీపీ అనురాధ, వైస్‌ ఎంపీపీ మధులత, తాండూరు మున్సిపల్‌  వైస్‌ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల దీప, సర్పంచ్‌ విజయలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు. 

బషీరాబాద్‌ మండల కేంద్రంలో ఎంపీడీవో, ఐకేపీ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. స్థానిక మహిళ సమాఖ్య భవనం ఎదుట మహిళలు బతుకమ్మలు పేర్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఆదేశానుసారం టీఆర్‌ఎస్‌ నాయకులు ఇందర్‌చెడ్‌ నర్సిరెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ రాజరత్నం, మహిళా విభాగం అధ్యక్షురాలు జయమ్మ బతుకమ్మ పోటీలో పాల్గొన్న మొదటి ఐదుగురికి నగదుతో పాటు పాల్గొన్న 40 మంది మహిళలకు కూడా బహుమతులు ప్రదానం చేశారు. ఎంపీపీ కరుణా అజయ్‌ప్రసాద్‌, వైస్‌ఎంపీపీ అన్నపూర్ణ, సర్పంచులు పూడూరు ప్రియాంక, రథోడ్‌ సునీత, ఎంపీటీసీలు రేఖపవాన్‌ఠాగూర్‌, పూర్మ సునీత, తహసీల్దార్‌ ఎన్‌.వెంకటస్వామి, డీటీ వీరేషంబాబు, తదితరులు పాల్గొన్నారు. 

కొడంగల్‌ మండల పరిధిలోని హస్నాబాద్‌లో శుక్రవారం రాత్రి మహిళలు, యువతులు రంగురంగుల పూలతో బతుకమ్మలను తయారుచేసి ఆడిపాడారు. అనంతరం బతుకమ్మలను స్థానిక చెరువులో నిమజ్ఞనం చేశారు. కులకచర్లలోని వివేకానంద కళాశాలలో విద్యార్థులు బతుకమ్మలు తయారుచేసి కళాశాల ఎదుట ఆడిపాడారు. వివేకానంద విద్యాసంస్థల చైర్మన్‌ ప్రహ్లాద్‌రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఊరేగింపుగా వెళ్లి సమీప కుంటల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ప్రిన్సిపాల్‌ బాలయ్యగౌడ్‌, అధ్యాపకులు పాల్గొన్నారు.  అదేవిధంగా ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ కొండాపూర్‌లోని సంస్కృతీ ఇంజనీరింగ్‌ కళాశాలలో, చౌదరిగూడలోని నల్ల నర్సింహారెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలల్లో విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్నారు. మల్లాడి రమాకాంత్‌రెడ్డి, గోవర్ధన్‌, సీవీ కృష్ణారెడ్డి, శివకేశవరెడ్డి, అధ్యాపకులు, విద్యార్ధులు పాల్గొన్నారు. కీసర మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ మల్లారపు ఇందిరా లక్ష్మీనారాయణ ఆద్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో మహిళ సర్పంచ్‌లు, అధికారులు, సమాఖ్య భవన్‌ సిబ్బంది, డ్వాక్రా గ్రూపు మహిళలు పెద్దఎత్తున పాల్గొని పాటలతో సందడి చేశారు.


Read more