డీజేల వినియోగం.. ఐదుగురిపై కేసు

ABN , First Publish Date - 2022-09-10T05:30:00+05:30 IST

డీజేల వినియోగం.. ఐదుగురిపై కేసు

డీజేల వినియోగం.. ఐదుగురిపై కేసు

మోమిన్‌పేట్‌, సెప్టెంబరు 10: బూర్గుపల్లిలో అంబేద్కర్‌ యూత్‌ సంఘం నాయకులు, చక్రంపల్లిలో అంబేద్కర్‌ యూత్‌, శివాజీ యూత్‌, యువసేన యూత్‌ సభ్యులు, చీమలదరిలో హనుమాన్‌ మందిర్‌ వినాయక ఉత్సవ కమిటీ నిర్వాహకులు శుక్రవారం రాత్రి వినాయక నిమజ్ఞనంలో డీజేలను ఉపయోగించారు. దీంతో వారిపై కేసులు నమోదు చేసినట్లు మోమిన్‌పేట్‌ ఎస్సై విజయ్‌ప్రకాశ్‌ తెలిపారు. నిమజ్ఞనంలో డీజేలను ఉపయోగించరాదని నోటీసులిచ్చినా వాడినట్లు ఎస్సై తెలిపారు.


Read more