వృద్ధ దంపతులపై ఎంపీటీసీ భర్త దాడి

ABN , First Publish Date - 2022-09-19T05:30:00+05:30 IST

వృద్ధ దంపతులపై ఎంపీటీసీ భర్త దాడి

వృద్ధ దంపతులపై ఎంపీటీసీ భర్త దాడి
దాడిలో గాయపడిన వృద్ధులు

  • పొలం అమ్మలేదనే కక్షతో కొట్టారని బాధితుల ఆరోపణ
  • అపస్మారక స్థితిలోకి చేరిన వృద్ధ దంపతులు
  • ఆస్పత్రికి తరలించిన స్థానికులు

నవాబుపేట, సెప్టెంబరు 19: పొలం వద్ద ఒంటరిగా ఉన్న వృద్ధులపై హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన నవాబుపేట మండలం పులుమామిడిలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు... పులుమామిడికి చెందిన తెలుగు యాదయ్య దంపతులు పొలం వద్ద ఒంటరిగా ఉన్న సమయంలో అదే గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ భర్త సోమన్నోళ్ల రామకృష్ణారెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి కలిసి వృద్ధులపై కర్రలతో దాడిచేశారు. యాదయ్య దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తులు వృద్ధులను వికారాబాద్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భరత్‌రెడ్డి తెలిపారు. పొలం అమ్మలేదనే కక్షతోనే దాడి చేశారని బాధితులు ఆరోపించారు. పొలం అమ్మాలని నిందితులు పలుమార్లు వొత్తిడి చేయగా అమ్మం అని చెప్పడంతోనే దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read more