రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ లక్షణ్‌ను కలిసిన ఎంపీపీ

ABN , First Publish Date - 2022-08-15T05:44:00+05:30 IST

రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ లక్షణ్‌ను కలిసిన ఎంపీపీ

రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ లక్షణ్‌ను కలిసిన ఎంపీపీ

ఘట్‌కేసర్‌ రూరల్‌, ఆగస్టు 14 : రాజ్యసభ సభ్యుడు, ముషీరాబాద్‌ మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ లక్ష్మన్‌ను ఆదివారం నగరంలోని ఆయన నివాసంలో ఘట్‌కేసర్‌ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఘట్‌కేసర్‌ పట్టణానికి చెందిన లక్ష్మణ్‌ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందని ఎంపీపీ ఈ సందర్భంగా తెలిపారు. కాగా, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ శనివారం ఎంపీపీ నివాసానికి వచ్చి బీజేపీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే, మరుసటి రోజే ఎంపీపీ లక్ష్మణ్‌ను కలవడం పట్ల ఘట్‌కేసర్‌ మండలంలో చర్చనీయాంశంగా మారింది. ఎంపీపీ బీజేపీలోకి వెళ్లడం ఖాయమని మండలంలో పలువురు చర్చించుకుంటున్నారు. బీజేపీ నాయకులు కాలేరు రామోజీ, కొమ్మిడి దామోదర్‌రెడ్డి, బసవ రాజుగౌడ్‌, హరినాధ్‌రెడ్డి, కోమటిరెడ్డి ప్రవీణ్‌రెడ్డిలు ఉన్నారు.

Read more