ఎమ్మెల్యే చెంతకు ఎమ్మెల్సీ వర్గీయులు

ABN , First Publish Date - 2022-12-12T00:09:58+05:30 IST

ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి చెంతకు నవాంద్గీ సొసైటీ డైరెక్టర్‌ అశోక్‌గౌతం సైతం చేరిపోయారు. ఆయన కొన్నేళ్లుగా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి వెన్నంటి ఉంటూ రాజకీయాల్లో చరుకుగా పాల్గొనేవారు.

ఎమ్మెల్యే చెంతకు ఎమ్మెల్సీ వర్గీయులు
ఎమ్మెల్యేను కలిసిన నవాంద్గీ ప్యాక్స్‌ డైరెక్టర్‌ అశోక్‌గౌతం తదితరులు

బషీరాబాద్‌, డిసెంబరు 11: ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి చెంతకు నవాంద్గీ సొసైటీ డైరెక్టర్‌ అశోక్‌గౌతం సైతం చేరిపోయారు. ఆయన కొన్నేళ్లుగా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి వెన్నంటి ఉంటూ రాజకీయాల్లో చరుకుగా పాల్గొనేవారు. అశోక్‌గౌతంతో పాటు పర్వత్‌పల్లి గ్రామానికి చెందిన ఎమ్మెల్సీ వర్గీయులు 30 మంది వరకు ఎమ్మెల్యేతో జతకట్టారు. నవాంద్గీ ప్యాక్స్‌ చైర్మన్‌ వెంకట్‌రాంరెడ్డి వీరందరి చేరికలో ముఖ్యభూమిక పోషించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసంలో వీరంతా ఆయనను కలిశారు. ఈ సందర్భంగా పార్టీకి, తన కోసం అహర్నిశలు కృషిచేస్తూ అండగా నిలవాలని ఎమ్మెల్యే కోరినట్లు నాయ కులు తెలిపారు. రెండుమూడు రోజు ల్లో ఎమ్మెల్యే వర్గంలోకి మరికొందరుప్రజాప్రతినిధులు, నాయకుల చేరికలుంటాయన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు ఇందర్చెడ్‌ నర్సిరెడ్డి, కో-ఆప్షన్‌ సభ్యులు రజాక్‌, పర్వత్‌పల్లి ఎంపీటీసీ బంటు రాజు, ఉప సర్పంచ్‌ బ్రహ్మానందరెడ్డి, దస్తాయ్యగౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-12T00:09:58+05:30 IST

Read more