అభయాంజనేయస్వామి ఆలయంలో ఎమ్మెల్యే రఘునందర్‌రావు పూజలు

ABN , First Publish Date - 2022-07-07T05:30:00+05:30 IST

అభయాంజనేయస్వామి ఆలయంలో ఎమ్మెల్యే రఘునందర్‌రావు పూజలు

అభయాంజనేయస్వామి ఆలయంలో ఎమ్మెల్యే రఘునందర్‌రావు పూజలు
ప్రత్యేక పూజల అనంతరం ఎమ్మెల్యే రఘునందన్‌రావును సన్మానిస్తున్న కుమార్‌యాదవ్‌

శంషాబాద్‌ రూరల్‌, జూలై 7: మండలంలోని నర్కూడ అమ్మపల్లి శ్రీ అభయాంజనేయస్వామికి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు గురువారం ప్రత్యేకపూజలు చేశారు. ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి కుమార్‌యాదవ్‌ ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛరణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వచ్చేఎన్నికల్లో బీజేపీ అధికారంలో వచ్చేవిధంగా అశీర్వదించాలని స్వామివారిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పార్టీ పటిష్టతకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డుసభ్యులు వినోద్‌కుమార్‌, సాయియాదవ్‌, భాస్కర్‌, శ్రీకాంత్‌, శ్రీను నాయక్‌, మల్లే్‌షగౌడ్‌, ప్రశాంత్‌, కరుణాకర్‌, రమేష్‌, తరుణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read more