అనంత పద్మనాభుడి సేవలో ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-10-03T05:49:47+05:30 IST

అనంత పద్మనాభుడి సేవలో ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి

అనంత పద్మనాభుడి సేవలో ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి
పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి

పరిగి/దోమ, అక్టోబరు 2: పరిగి ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి ఆదివారం వికారాబాద్‌లోని అనంత పద్మనాభస్వామిని దర్శించుకున్నారు. పూజారులు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. ఆయన వెంట మునిసిపల్‌ చైర్మన్‌ అశోక్‌, ఏఎంసీ చైర్మన్‌ సురేందర్‌, ప్యాక్స్‌ చైర్మన్‌ శ్యాంసుందర్‌రెడ్డి, వైస్‌చైర్మన్‌ ఎస్‌.భాస్కర్‌, బి.ప్రవీణ్‌రెడ్డి ఉన్నారు. కాగా దోమ మండలం  పాలెపల్లికి చెందిన లక్ష్మి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి రూ.లక్ష సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును అందజేశారు. వైస్‌ ఎంపీపీ మల్లేశం, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు ఆంజనేయులు, నవీన్‌రెడ్డి పాల్గొన్నారు.


Read more