-
-
Home » Telangana » Rangareddy » May the soul of Balamalles rest in peace-NGTS-Telangana
-
బాలమల్లేష్ ఆత్మకు శాంతి కలగాలి
ABN , First Publish Date - 2022-09-08T05:47:59+05:30 IST
బాలమల్లేష్ ఆత్మకు శాంతి కలగాలి

- రాచకొండ సీపీ మహేశ్ భగవత్
ఘట్‌కేసర్ రూరల్, సెప్టెంబరు 7 : అనారోగ్యంతో మృతిచెందిన షీటీం ఎస్‌ఐ అబ్బసాని బాలమల్లేష్ యాదవ్ ఆత్మకు శాంతి కలగాలని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ అన్నారు. బుధవారం ఉదయం ఘట్‌కేసర్‌లోని బాలమల్లేష్ నివాసానికి చేరుకున్న సీపీ ఆయన మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిం చారు. బాలమల్లే్‌షకు రావాల్సిన పెన్షన్, బెనిఫిట్స్ త్వరగా వచ్చే విధంగా చూస్తానని కుటుంబసభ్యులకు సీపీ హమీ ఇచ్చారు. కార్యక్రమంలో ఘట్‌కేసర్ ఇన్‌స్పెక్టర్ చంద్రబాబు, పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భద్రారెడ్డి, ఉపాధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి, సిబ్బంది బాలమల్లేష్ పాల్గొని నివాళులర్పించారు.