సామూహిక జాతీయ గీతాలాపన

ABN , First Publish Date - 2022-08-16T05:30:00+05:30 IST

75వ స్వాతంత్య్ర దేశ వజ్రోత్సవాలలో భాగంగా మంగళవారం జిల్లా ప్రజలు

సామూహిక జాతీయ గీతాలాపన
శంకర్‌పల్లి ప్రధాన చౌరస్తాలో జాతీయ గీతాలాపన చేస్తున్న ప్రజలు

75వ స్వాతంత్య్ర దేశ వజ్రోత్సవాలలో భాగంగా మంగళవారం జిల్లా ప్రజలు సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టణ, గ్రామాలలోని పలు కూడళ్ల వద్ద జాతీయ జెండాలు ఉంచి జాతీయ గీతాన్ని పాడారు. జాతీయ జెండాలు చేతపట్టి విద్యార్థులు, యువతీయువకులు ర్యాలీలు తీశారు. భారత్‌ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. 

సీఐ మహేష్‌గౌడ్‌ ఆధ్వర్యంలో శంకర్‌పల్లి ప్రధాన చౌరస్తాలో ఉదయం 11.30 నిమి షాలకు సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు భారీ జాతీయ జెండాలతో ర్యాలీగా వచ్చారు. కార్యక్రమంలో వ్యాపారస్తులు, భారీ సంఖ్యలో హజరయ్యారు. 

- శంకర్‌పల్లి, ఆగస్టు 16Read more