కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-09-20T05:26:26+05:30 IST

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

మాడ్గుల, సెప్టెంబరు 19: కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మాడ్గుల మండలంలోని అందుగుల గ్రామంలో చోటుచేసుకుంది. మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన శివాని(24)కి అందుగుల గ్రామానికి చెందిన రవితో 2018లో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు అభినయ్‌(3సంవత్సరాలు), ఆదిత్య(2సంవత్సరాలు) ఉన్నారు. ఇటీవల భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మనస్తాపం చెందిన శివాని ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న సీఐ కృష్ణ మోహన్‌ ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి అన్న ఎం.నాగేశ్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కృష్ణమోహన్‌ తెలిపారు. 

Read more