రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-02-20T05:09:45+05:30 IST

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

పరిగి, ఫిబ్రవరి 19 : ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదం శనివారం రాత్రి జరిగింది. ఏపీ23 టీఏ1441 నంబరు గల ఆటో పరిగి నుంచి వికారాబాద్‌ వైపు వెళుతోంది. ఈ క్రమంలో నస్కల్‌-గొట్టిముక్కల గ్రామాల మధ్య ఆటోను గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న 30 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఆటోడ్రైవర్‌ ఆటోను అక్కడే వదిలిపోయాడు. ప్రమాద ఘటన స్థలాన్ని పరిగి ఏఎస్‌ఐ సూర్యనారాయణ సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పరిగి ఆస్పత్రికి తరలించారు. ఆటోను గుర్తు తెలియని బొలెరో వాహనం ఢీకొట్టి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. 

Read more