కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-09-19T05:47:25+05:30 IST

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

యాచారం, సెప్టెంబరు 18: కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని గడ్డమల్లాయగూడ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శేఖర్‌(45), ఇందిర దంపతులు కుటుంబంలో ఆర్థిక సమస్యలతో కొద్ది రోజులుగా గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో శేఖర్‌ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి  ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు కేసు  దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటనారాయణ తెలిపారు. 

Read more