గుట్కా రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్టు

ABN , First Publish Date - 2022-05-24T05:40:25+05:30 IST

గుట్కా రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్టు

గుట్కా రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్టు
గుట్కా సంచుల వద్ద నిందితుడు మారుతి

ఘట్‌కేసర్‌ రూరల్‌, మే 23: గుట్కాలు రవాణా చేస్తున్న ఇద్దరిలో ఒకరిని అదుపులోకి తీసుకోగా మరో వ్యక్తి పరారైన ట్టు పోలీసుస్టేషన్‌ సోమవారం పేర్కొన్నారు. సీఐ చంద్రబాబు తెలిపిన వివరాలు ప్రకారం.. సివిల్‌, కుషాయిగూడ ట్రాఫిక్‌ పోలీసులు సంయుక్తంగా అవుటర్‌ రింగురోడ్డుపై టోల్‌ఫ్లాజా వద్ద వాహనాలు తనిఖీలు చేశారు. కారు(ఏపీ12 కే0100)ను ఆపడంతో డ్రైవర్‌ పారిపోయాడు. కారులోని మరో వక్తి అదుపులోకి తీసుకొని విచారించగా గుట్కాలు రవాణా చేస్తున్న విషయం బయటపడింది. బీదర్‌ నుంచి వరంగల్‌కు గుట్కాలను తెచ్చి అమ్ముతున్నట్టు విచారణలో తేలింది. 30కిలోల అంబర్‌ పొగాకు బ్యాగులు, 100 చిన్న ప్యాకెట్లు లభించాయి. ఈ గుట్కాల విలువ రూ.5లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. కారును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మారుతిని రిమాండ్‌కు తరలించిగా, డ్రైవర్‌ రాజశేఖర్‌ పరారయ్యాడని, దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.


  • గుట్కా అమ్ముతున్న ఇద్దరిపై కేసు

పరిగి: గుట్కాలు అమ్ముతున్న ఇద్దరిపై కేసు నమోదు చే సినట్లు ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపారు. పరిగిలోని గ్రంథాలయం దగ్గర ఆకుతోట రాములు కిరాణ షాపులో, అఫ్జల్‌ కాంప్లెక్స్‌ వద్ద షఫీకి చెం దిన సూర్యాస్‌ కన్ఫెక్షరీ షాపులో సోమవారం తనిఖీలు నిర్వహించగా గుట్కాలు లభించాయన్నారు. రెండు షాపుల్లో రూ.12వేల విలువైన గుట్కా లభించిందని, ఇద్దరిపై కేసు నమోదు చేశామని చెప్పారు. 

Updated Date - 2022-05-24T05:40:25+05:30 IST