పొలాలలో నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలి

ABN , First Publish Date - 2022-10-01T05:26:31+05:30 IST

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు వ్యవసాయ పంట పొలాలలో

పొలాలలో నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలి
కొత్తపేటలో కందిపంటను పరిశీలిస్తున్న ఏవో శిరీష

కేశంపేట, సెప్టెంబరు 30: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు వ్యవసాయ పంట పొలాలలో నీరు నిలిచి పంటలు దెబ్బతినే ఆవకాశం ఉందని... పంటపొలాలలో నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని కేశంపేట మండల వ్యవసాధికారిణీ శిరీష సూచించారు. కేశంపేట మండలపరిధిలోని కొత్తపేట గ్రామంలో రైతులు సాగు చేస్తున్న పంటలను పరిశీలించారు. వర్షాలు కురుస్తున్న ప్రస్తుత తరుణంలో పంటపొలాలలో నీటి నిల్వ లేకుండ చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈవో రాము, రైతులు పాల్గొన్నారు.Read more