మధ్యాహ్న భోజన కార్మికుల సంబురం

ABN , First Publish Date - 2022-03-17T04:16:33+05:30 IST

వేయి రూపాయలు ఉన్న మధ్యాహ్న భోజన

మధ్యాహ్న భోజన కార్మికుల సంబురం
మంత్రి సబితా ఇంద్రారెడ్డికి స్వీట్‌ ఇస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు

  • గౌరవ వేతనం పెంపు ప్రకటనతో మంత్రికి స్వీట్లు అందజేత


రంగారెడ్డి అర్బన్‌, మార్చి 16 : వేయి రూపాయలు ఉన్న మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనం రూ.3 వేలకు పెంచుతూ సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించడం పట్ల మధ్యాహ్నభోజన కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. బుధవారం మంత్రి సబితాఇంద్రారెడ్డి కార్యాలయానికి మధ్యాహ్న భోజన కార్మికులు తరలివచ్చి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రికి స్వీట్స్‌ తినిపించారు. 54,201 మంది మధ్యాహ్న భోజన కార్మికులకు లబ్ధి చేకూరేలా తీసుకున్న నిర్ణయం వల్ల పెద్దఎత్తున సంబరాలు జరుపుకున్నామని కార్మికులు మంత్రికి తెలిపారు. ప్రభుత్వం ఏటా రూ.108 కోట్ల భారం పడుతున్నా గొప్ప మనసు చాటుకున్న సీఎం కేసీఆర్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు. గౌరవ వేతనం పెంచడంలో ముఖ్యపాత్ర పోషించి, మధ్యాహ్న భోజన కార్మికుల కుటుంబాల్లో వెలుగు నింపారని మంత్రి సబితారెడ్డిని కొనియాడారు. మంత్రిని కలిసిన వారిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు హనుమాండ్లు తదితరులున్నారు.



Updated Date - 2022-03-17T04:16:33+05:30 IST