రుణాలతో జీవనోపాధి పెంచుకోవాలి

ABN , First Publish Date - 2022-09-21T05:30:00+05:30 IST

రుణాలతో జీవనోపాధి పెంచుకోవాలి

రుణాలతో జీవనోపాధి పెంచుకోవాలి

ధారూరు, సెప్టెంబరు 21: ఐకేపీ మహిళా పొదుపు సంఘాలు బ్యాంకుల్లో తీసుకుంటున్న రుణాలతో జీవనోపాధ ులను పెంచుకోవాలని  స్టేట్‌ లీడ్‌ బ్యాంక్‌ అధికారి తేజ్‌దీప్‌ బిహార  తెలిపారు. ధారూరు మండల కేంద్రంలోని స్త్రీశక్తి భవనంలో బుధవారం ఆర్థిక అక్షరాస్యతపై జరిగిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని, రుణాలను సకాలంలో చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌బీఐ ఎల్‌బీవో రాంబాబు, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మమత, జిల్లా వివోఏల సంఘం అధ్యక్షురాలు సుజాత, ఏపీఎం సురేశ్‌, సీసీలు, మహిళ సంఘాల బాద్యులు పాల్గొన్నారు. 


Read more