స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌గా లింగ్యానాయక్‌

ABN , First Publish Date - 2022-09-25T04:48:33+05:30 IST

స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌గా లింగ్యానాయక్‌

స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌గా లింగ్యానాయక్‌

మేడ్చల్‌, సెప్టెంబరు 24 : జిల్లా రెవెన్యూ అధికారి జి.లింగ్యానాయక్‌ స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి పొందారు. ఈ మేరకు ప్రభుత ్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన డిప్యూటీ కలెక్టర్‌ హోదాలో జిల్లా రెవెన్యూ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. పదోన్నతితో డీఆర్‌ఓ, అదనపు కలెక్టర్‌ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి కల్పించినప్పటికీ పోస్టింగ్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి పొందిన లింగ్యానాయక్‌కు శనివారం పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు.

Read more