అరాచకాల నుంచి విముక్తి పొందిన దినమే విమోచనం

ABN , First Publish Date - 2022-09-18T05:12:01+05:30 IST

అరాచకాల నుంచి విముక్తి పొందిన దినమే విమోచనం

అరాచకాల నుంచి విముక్తి పొందిన దినమే విమోచనం
జాతీయ జెండాను ఆవిష్కరించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి

  • బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి

రంగారెడ్డి అర్బన్‌/కేశంపేట/యాచారం/శంషాబాద్‌ రూరల్‌/మహేశ్వరం/కందుకూరు,సెప్టెంబరు 16: రజాకార్ల అకృత్యాలు, అరాచకాల నుంచి హైదరాబాద్‌ సంస్థానం విముక్తి పొందిన దినం సెప్టెంబరు 17 అని, అందుకే మనం యేటా తెలంగాణ విమోచనోత్సవం జరుపుకుంటున్నామని బీజేపీ జిల్లా అఽధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి అన్నా రు. శనివారం బీజేపీ జిల్లా కార్యాలయం వద్ద జా తీయ జెండాను ఆవిష్కరించారు. దేశ నాయకు ల కు, అమరులకు నివాళి అర్పించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్‌ ప్రేమ్‌రాజ్‌, జిల్లా ఉపాధ్యక్షుడు చింతల నందకిశోర్‌, కార్యదర్శి తెరటి లక్ష్మణ్‌, బీజేవైఎం రాష్ట్ర అదనపు కార్యదర్శి మ హేందర్‌, ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు ప్రశాంత్‌, జిల్లా కార్యాలయం సహకార్యదర్శి ఊటు న రేష్‌, బీజేపీ శంషాబాద్‌ నాయకులు పాల్గొన్నారు. కేశంపేటలో బీజేపీ నాయకులు జాతీయ జెండాను ఎగరవేశారు. బీజేపీ మండల అధ్యక్షులు నరసింహయాదవ్‌ పాల్గొన్నారు. యాచారం మండల ంలోని వివిధ గ్రామాల్లో బీజేపీ కార్యకర్తలు నాయకులు ఆయా గ్రామాల్లో జాతీయ జెండాలు ఆవిష్కరించారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ చొరవ కారణంగానే తెలంగాణ రాష్ట్ర అవతరణకు నాంది పలికా రని మండల బీజేపీ అధ్యక్షుడు తాండ్ర రవి అన్నారు. తెలంగాణ విమోచన దినం జరిపి రాష్ట్ర ఖ్యాతిని చాటిచెప్పాలని ఆయన యువతకు పి లుపునిచ్చారు. తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరపాల్సి ఉందని ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవతీసుకోవాలన్నారు. శంషాబాద్‌ మండల పరిధిలోని వివిధ గ్రా మాల్లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు బీజేపీ నేతలు. నర్కూడ అమ్మపల్లిలో బీజేపీ సీనియర్‌ బుక్క వేణుగోపాల్‌ జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... రజాకార్ల క్రూరపాలన నుంచి తెలంగాణ సం స్థాన ప్రజలకు విముక్తి కలిగించింగిన నేత సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అన్నారు. అప్పట్లో వారి అరాచకాలతో ఎంతో మంది  అమాయక ప్రజలు ప్రాణాలు వదిలారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు విమోచన దిన్సోతవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా కార్యదర్శి ఎన్‌. కుమార్‌యాదవ్‌, మల్లే్‌షయాదవ్‌, జూకల్‌ ఎంపీటీసీ ప్రవీణ్‌కుమార్‌, మెండె కుమార్‌, టిల్లు, శివ పాల్గొన్నారు. కందుకూరులో బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు అనేగౌని అశోక్‌గౌడ్‌ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో తెలంగాణ విమోచన దినోత్సవాలను జరుపుకున్నారు. ఏబీవీపీ నేతలు సైతం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. అదే విధంగా బీజేపీ నాయకులు నందిగామ మండల కేంద్రంలో జాతీయ జెండాను ఎగరవేశారు. త్యాగధనుల కృషితో తెలంగాణకు విముక్తి లభించిందని వారు గుర్తు చేశారు.

Read more