పండిత్‌ దీన్‌దయాళ్‌ ఆశయ సాధనకు కృషి చేద్దాం

ABN , First Publish Date - 2022-09-25T05:30:00+05:30 IST

పండిత్‌ దీన్‌దయాళ్‌ ఆశయ సాధనకు కృషి చేద్దాం

పండిత్‌ దీన్‌దయాళ్‌ ఆశయ సాధనకు కృషి చేద్దాం
కులకచర్ల : బీజేపీ కార్యాలయంలో దీన్‌దయాళ్‌ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ప్రహ్లాద్‌రావు, తదితరులు

పెద్దేముల్‌/తాండూరు/దోమ/కులకచర్ల, సెప్టెంబరు 25 : పండిత్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ ఆశయసాధనకు అందరం కలిసి కృషి చేద్దామని పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు అన్నారు. ఈమేరకు బీజేపీ పెద్దేముల్‌ మండలాధ్యక్షులు మండల కేంద్రంలో ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో దీన్‌దయాల్‌ జయంతి వేడుకలను నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి హరీ్‌షగౌడ్‌, ఉపాధ్యక్షుడు రాము, బీజేవైఎం జిల్లా కార్యదర్శి రమే్‌షసాగర్‌, నాయకులు పరిపూర్ణచారి, కృష్ణసాయి, వెంకటేష్‌, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పండిత్‌ దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని తాండూరు బీజేపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. బీజేపీ జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్‌, ఎస్టీ మోర్చా రాష్ట్ర స్పోర్ట్స్‌ కన్వీనర్‌ భానుపవార్‌, సీనియర్‌ నాయకులు పూజారి పాండు, మడపతి ప్రభుశంకర్‌, పట్టణ ప్రధాన కార్యదర్శి కృష్ణ, కార్యదర్శి  ప్రకాష్‌, మీడియా ఇన్‌చార్జి చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. దోమ మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి మల్లేశం ఆధ్వర్యంలో దీన్‌దయాళ్‌ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. బీజేపీ నాయకులు వెంకట్రాములు, మల్లేశం, బాల్‌రాజ్‌, మల్లప్ప, భవనేశ్వర్‌, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు. 

బీజేపీ ఎదుగుదలకు పండిట్‌ దీన్‌దయాళ్‌ ఎంతో శ్రమించారని బీజేపీ జిల్లా కార్యదర్శి టీవీ నర్సింహులు అన్నారు. కులకచర్ల బీజేపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రహ్లాద్‌రావు, నాయకులు హరికృష్ణ, రాంచందర్‌, పెంటయ్య, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. కులకచర్ల బీజేపీ కార్యాలయంలో దీన్‌దయాళ్‌ జయంతిని నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రతీ యువకుడు పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ ఆశయసాధనకు కృషి చేయాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్యగౌడ్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు మైపాల్‌, జిల్లా నాయకులు లక్ష్మికాంత్‌రావు, భీమయ్య, తదితరులు పాల్గొన్నారు. అలాగే చౌడాపూర్‌ మండల కేంద్రంలో కూడా పండిట్‌ దీన్‌దయాళ్‌ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. అనంతరం ప్రధాని నరేంద్రమోదీ మన్‌కీ బాత్‌ కార్యక్రమాన్ని టీవీలో వీక్షించారు.


Read more