మహనీయులు చూపిన మార్గంలో నడుద్దాం

ABN , First Publish Date - 2022-10-03T05:52:46+05:30 IST

మహనీయులు చూపిన మార్గంలో నడుద్దాం

మహనీయులు చూపిన మార్గంలో నడుద్దాం
కడ్తాల: గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న ప్రజాప్రతినిధులు, నాయకులు

  • ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌
  • ఘనంగా మహాత్మాగాంధీ, లాల్‌ బహదూర్‌శాస్త్రి జయంతి 

షాద్‌నగర్‌అర్బన్‌/నందిగామ/కొందుర్గు/కొత్తూర్‌/శంకర్‌పల్లి/చేవెళ్ల/ షాబాద్‌/మొయినాబాద్‌/మొయినాబాద్‌  రూరల్‌/ఆమనగల్లు/కడ్తాల్‌/తలకొండపల్లి/కందుకూరు/కేశంపేట/చౌదరిగూడ/ఇబ్రహీంపట్నం/యాచారం, అక్టోబరు 2: శాంతియుతంగా ఉద్యమించిన మహనీయులు చూపిన మార్గంలో నడుద్దామని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ పిలుపునిచ్చారు. షాద్‌నగర్‌లో మున్సిపల్‌ చైర్మన్‌ నరేందర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతిపిత మహాత్మాగాంధీ, దేశ మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రిల జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరువురి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అదేవిధంగా ఫరూఖ్‌నగర్‌లోని గాంధీ విగ్రహానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులుతో పాటు టీఆర్‌ఎస్‌, బీజేపీ, టీడీపీ నాయకులు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీ వైస్‌చైర్మన్‌ గణేష్‌, జడ్పీటీసీ వెంకట్‌రాంరెడ్డి, ఎంపీపీ ఖాజాఇద్రీష్‌, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ నటరాజ్‌, కౌన్సిలర్లు అంతయ్య, రాజేశ్వర్‌, జీటీ శ్రీనివాస్‌, ఏ.శ్రీనివా్‌సగౌడ్‌, రాయికల్‌ శ్రీనివాస్‌, కృష్ణవేణి, నందీశ్వర్‌, మాధురి, బీజేపీ నాయకులు శ్రీవర్ధన్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, అందె బాబయ్య, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు వీర్లపల్లి శంకర్‌, బాబర్‌ఖాన్‌, బాల్‌రాజ్‌గౌడ్‌, తిరుపతిరెడ్డి, కొంకళ్ళ చెన్నయ్య, టీడీపీ నాయకుడు చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి, తెలంగాణ వైఎ్‌సఆర్‌ పార్టీ నాయకుడు ఇబ్రహీం పాల్గొన్నారు. నందిగామలో శివాజీ యూత్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌, జడ్పీ వైస్‌చైర్మన్‌ ఈట గణేష్‌, ఎంపీడీవో బాల్‌రెడ్డి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వెంకట్‌రెడ్డి, కృష్ణ, చంద్రపాల్‌రెడ్డి, కుమార్‌గౌడ్‌ పాల్గొన్నారు. అదేవిధంగా కొందుర్గు మండలంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో హెల్త్‌ ఇండియా వారి ఆధ్వర్యంలో గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. విశ్వనాథ్‌పూర్‌, తంగళ్లపల్లి, మహాదేవ్‌పూర్‌, ముట్పుర్‌లో ఎంపీపీ జంగయ్య, వైస్‌ఎంపీపీ రాజే్‌షపటేల్‌,  సర్పంచులు శ్రీధర్‌రెడ్డి, బాల్‌రాజ్‌, రాంచంద్రయ్య, నర్సింహారెడ్డి, నాయకులు రామకృష్ణ, శ్రీకాంత్‌గౌడ్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. కొత్తూర్‌లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బాతుక లావణ్యదేవేందర్‌యాదవ్‌, వైస్‌చైర్మన్‌ డోలీ రవీందర్‌, ఎంపీటీసీ రాజేందర్‌గౌడ్‌, కౌన్సిలర్‌ శ్రీనివా్‌సలు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అదేవిధంగా శంకర్‌పల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి ప్రవీణ్‌కుమార్‌ గాంధీజీ, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులల్పించారు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్‌ వెంకట్‌రాంరెడ్డి, కౌన్సిలర్లు శ్వేతాపాండురంగారెడ్డి, చాకలి అశోక్‌, చంద్రమౌళి, పార్శిబాలకృష్ణ, లక్ష్మమ్మ, రాంరెడ్డి, రాములు పాల్గొన్నారు. అదేవిధంగా చేవెళ్లలోని మండల పరిషత్‌ కార్యాలయంలో జడ్పీటీసీ ఎం.మాలతికృష్ణారెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డిలు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. చేవెళ్ల గ్రామ పంచాయతీలో బండారు శైలజ, పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ యాదయ్య, కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో డీసీసీ జిల్లా మాజీఅధ్యక్షుడు పడాల వెంకట్‌స్వామి, సున్నపు వసంతం, శ్రీనివా్‌సగౌడ్‌, వీరేందర్‌రెడ్డి, రాములు, పెంటయ్యగౌడ్‌, యాలాల మహేశ్వర్‌రెడ్డి నివాళులర్పించారు. సీపీఐ కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సభ్యులు రామస్వామి, ప్రభులింగం, మండల కార్యదర్శి సత్తిరెడ్డి, సూధాకర్‌గౌడ్‌లు గాంధీజీ చిత్రపటానికి పూలువేసి నివాళులర్పించారు. అదేవిధంగా షాబాద్‌ మండలంలో సీఐ  గురువయ్యగౌడ్‌, టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి పామెన భీంభారత్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు కావలి చంద్రశేఖర్‌లు గాంధీజీ, లాల్‌బహదూర్‌శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అదేవిధంగా మొయినాబాద్‌ మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మాణెయ్య, నియోజకవర్గం సీనియర్‌ నాయకులు షాబాద్‌ దర్శన్‌, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, యువజన సంఘాలు, వివిధ పార్టీల ఆధ్వర్యంలో గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమనగల్లు, కడ్తాల, తలకొండపల్లి మండల కేంద్రాలతో పాటు ఆయా మండలాల పరిధిలోని గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయా చోట్ల జరిగిన కార్యక్రమాల్లో మార్కెట్‌ చైర,్మన్‌ శ్రీనివా్‌సరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్‌ జి.వెంకటేశ్‌, మార్కెట్‌ వైస్‌చైర్మన్‌ గిరియాదవ్‌, సీఐ ఉపేందర్‌, జడ్పీటీసీలు అనురాధపత్యనాయక్‌, దశరథ్‌నాయక్‌, ఉప్పల వెంకటేశ్‌, ఎంపీపీలు అనితవిజయ్‌, కమ్లీమోత్యనాయక్‌, నిర్మలశ్రీశైలం గౌడ్‌, పీసీసీ సభ్యుడు ఆయిళ్ల శ్రీనివా్‌సగౌడ్‌,  సీఎల్‌శ్రీనివాస్‌ యాదవ్‌, ముజుబర్‌ రహెమాన్‌, గూడూరు శ్రీనివా్‌సరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ రాంపాల్‌ నాయక్‌, వైస్‌చైర్మన్‌ దుర్గయ్య, లయన్స్‌క్లబ్‌ ఉపాధ్యక్షుడు రాము, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బీక్యనాయక్‌, గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి, నాయకులు పాల్గొన్నారు. తలకొండపల్లి మండల కేంద్రంలో గాంధీజీ విగ్రహ ఏర్పాటుకు  సర్పంచ్‌ లలితజ్యోతయ్య, ఉపసర్పంచ్‌ అనిల్‌, ఎంపీటీసీ హేమరాజు స్థానిక నాయకులతో కలిసి భూమి పూజ చేశారు.  నాయకులు శేఖర్‌, కోటీశ్వర్‌, విఠల్‌, పాండు, దశరథం, రవికుమార్‌ పాల్గొన్నారు. కందుకూరు మండల కేంద్రంతో పాటు 35 గ్రామాల్లో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మండల కేంద్రంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, ఎంపీపీ మంద జ్యోతి, వైస్‌ఎంపీపీ జి.శమంతప్రభాకర్‌రెడ్డిలు నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆర్డీవో వెంకటాచారి, తహసీల్దార్‌ మహేందర్‌రెడ్డి, ఎంపీడీవో వెంకట్రాములు, ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి, డి.చంద్రశేకర్‌, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కేశంపేట మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ రవీందర్‌ యాదవ్‌, జడ్పీటీసీ తాండ్ర విశాల శ్రావణ్‌రెడ్డి, తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ అజంఅలీ, వేముల్‌నర్వలో సర్పంచ్‌ మంజుల మల్లేష్‌, ఇప్పలపల్లిలో సర్పంచ్‌ తోట ఆంజనేయులు, కొత్తపేటలో సర్పంచ్‌ నవీన్‌ కుమార్‌లు గాంధీ చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లేడ్‌ చౌదరిగూడ మండలంలోని బస్టాండ్‌ ఆవరణలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు హఫీజ్‌ ఆధ్వర్యంలో,  కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు రాజు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  అదేవిధంగా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ శేరిగూడలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు మండల అధ్యక్షుడు మొద్దు అంజిరెడ్డ్డి, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ ఆకుల యాదగిరి, టీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ అధ్యక్షుడు అల్వాల వెంకట్‌రెడ్డి, బర్ల జగదీశ్వర్‌యాదవ్‌, కౌన్సిలర్లు అల్వాల జ్యోతి, నల్లబోలు మమత, కసరమోని పద్మ, భర్తాకి జగన్‌ పాల్గొన్నారు. అదేవిధంగా యాచారం మండలంలో పంచాయతీ కార్యాలయంలో ఎంపీపీ కొప్పు సుకన్య బాషా, సర్పంచ్‌ ఎం.శ్రీధర్‌రెడ్డి, ఆర్యవైశ్య సంఘ మండల అధ్యక్షుడు వి.శ్రీనివాసగుప్తలు గాంధీజీకి ఘన నివాళులర్పించారు.

Read more