మహనీయుల ఆశయాలను సాధిద్దాం

ABN , First Publish Date - 2022-04-06T04:40:28+05:30 IST

పార్లమెంటేరియన్‌గా బాబు జగ్జీవన్‌రామ్‌ ప్రజాస్వామ్య వ్యవస్థకు

మహనీయుల ఆశయాలను సాధిద్దాం
చేవెళ్లలో జగ్జీవన్‌రామ్‌ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న మంత్రి సబితారెడ్డి

  • జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకల్లో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి

చేవెళ్ల, ఏప్రిల్‌ 5 : పార్లమెంటేరియన్‌గా బాబు జగ్జీవన్‌రామ్‌ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎనలేని సేవలు అందించారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతి సందర్భంగా చేవెళ్ల మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే కాలె యాదయ్య, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. బాబు జగ్జీవన్‌రామ్‌ విద్యావేత్తగా, సామాజిక వేత్తగా, రాజనీతిజ్ఞత గల ప్రజాస్వామ్యవాదిగా ఖ్యాతి గడించారని తెలిపారు. ఆయన చూపిన మార్గంలో ప్రతిఒక్కరూ నడుచుకోవాలన్నారు. బాబు జగ్జీవన్‌రామ్‌ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దళితుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అంతకుముందు ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి చేవెళ్లలో బాబు జగ్జీవన్‌రామ్‌ విగ్రహం వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ పి.కృష్ణారెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ప్రభాకర్‌, ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, వైఎస్‌ ఎంపీపీ శివప్రసాద్‌, సున్నపు వసంతం, రాములు, బండారు శైలజ, బాల్‌రాజ్‌, యాదగిరి, మాణిక్యరెడ్డి, బి.నర్సింహులు, కె.రమేశ్‌గౌడ్‌, గంగి యాదయ్య, పొట్ట రామకృష్ణ, వెంకటయ్య, బుచ్చయ్య, సుదర్శన్‌, రమేశ్‌, బాలు, సత్యనారాయణ, రామస్వామి, ప్రభులింగం, రమేశ్‌, యాదయ్య, శ్రీనివాస్‌, మాణిక్యం, దుర్గాప్రసాద్‌, పెం టయ్య, మాణయ్య, బుచ్చయ్య, వెంకటయ్య, మల్లేశ్‌, జగన్నాథం ఉన్నారు.


వివిధ పార్టీల ఆధ్వర్యంలో..

చేవెళ్ల మండల కేంద్రంలో బాబుజగ్జీవన్‌ రామ్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. డీసీసీ మాజీ అధ్యక్షుడు పడాల వెంకట్‌స్వామి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు సున్నపు వసంతం, చేవెళ్ల సర్పంచ్‌ బండారు శైలజ, పీఏసీఎస్‌ చైర్మన్‌ దేవర వెంకట్‌రెడ్డి, అనంత్‌రెడ్డి, రామస్వామి, సుధాకర్‌గౌడ్‌ తదితరులు జగ్జీవన్‌రాం విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు బాబుజగ్జీన్‌రామ్‌ చూపించిన మార్గంలో నడుచుకోవాలన్నారు. దేశ అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. 



Updated Date - 2022-04-06T04:40:28+05:30 IST