పాలెపల్లి, ఐనాపూర్‌ ప్రాంతాల్లో చిరుత సంచారం?

ABN , First Publish Date - 2022-09-19T05:30:00+05:30 IST

పాలెపల్లి, ఐనాపూర్‌ ప్రాంతాల్లో చిరుత సంచారం?

పాలెపల్లి, ఐనాపూర్‌ ప్రాంతాల్లో చిరుత సంచారం?

  • ఎటూ తేల్చని ఫారెస్ట్‌ అధికారులు

దోమ, సెప్టెంబరు 19: పాలెపల్లి-ఐనాపూర్‌ మధ్యలో చిరుత సంచరించినట్టు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే చిరుత ఆనవాళ్లను ఫారెస్ట్‌ అధికారులు గుర్తించలేకపోయారు. సోమవారం పాలేపల్లి-ఐనాపూర్‌ ప్రాంతంలో చిరుత సంచరించిన ప్రాంతంలో ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ సాయికుమార్‌ పరిశీలించారు. అది చిరుత పులా, హైనానా? మరేదైనా జంతువా? అనే విషయం నిర్ధారణ చేయలేదు. గుండాల్‌కు చెందిన రత్నం అనే వ్యక్తి ఆదివారం రాత్రి బైక్‌పై హైదరాబాద్‌ వెళ్తుండగా దండిగారి శ్రీశైలం పొలంలో చిరుత కనిపించిందని గ్రామస్తులకు తెలిపాడు. దీంతో సోమవారం గ్రామస్తులు పారెస్ట్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు చేరుకొని పాదముద్రలు గుర్తించినా అవి ఏ మృగానివో అనేది తే ల్చలేదు. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

Read more