జోడో యాత్రలో పాల్గొన్న నాయకులు

ABN , First Publish Date - 2022-11-02T23:42:29+05:30 IST

ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రలో జిల్లాలోని పలు మండలాల నాయకులు పాల్గొని నడుస్తున్నారు.

జోడో యాత్రలో పాల్గొన్న నాయకులు
భారత్‌ జోడో యాత్రలో పాల్గొన్న పీసీసీ సభ్యుడు జంగారెడ్డి

కడ్తాల్‌/షాద్‌నగర్‌ అర్బన్‌/కందుకూరు, నవంబరు 2: ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రలో జిల్లాలోని పలు మండలాల నాయకులు పాల్గొని నడుస్తున్నారు. బుధవారం కడ్తాల మండలం ఎన్‌ఎ్‌సయూఐ అధ్యక్షుడు షాబుద్దీన్‌ యాత్రలో పాల్గొని బోయిన్‌పల్లి నుంచి పటాన్‌చెరు రాహుల్‌తో వరకు నడిచారు. జోడోయాత్రలో రాహుల్‌గాంధీని కలుసుకోవడం తనకు ఆనందంగా ఉందని షాద్‌నగర్‌కు చెందిన రాయికంటి కృష్ణారెడ్డి అన్నారు. జోడోయాత్రతో పార్టీ బలోపేతం అవుతుందన్నారు. రాహుల్‌గాంధీ చేస్తున్నా భారత్‌ జోడోయాత్రలో కందుకూరు మండల నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాలో కొనసాగిన జోడోయాత్రకు పీసీసీ సభ్యుడు ఏనుగు జంగారెడ్డి, మైనార్టీసెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి అఫ్జల్‌బేగ్‌, పార్టీ మండల అధ్యక్షుడు కృష్ణానాయక్‌, లేడీ వింగ్‌ అధ్యక్షురాలు బుక్క ప్రశాంతిపాండురంగారెడ్డి, ప్యాక్స్‌ మాజీ చైర్మన్‌ మల్లేష్‌, మల్లయ్య, జగన్‌, వి.బాబు, పి.సుధాకర్‌రెడ్డి, అంజయ్య, కృష్ణయ్య, దేవేందర్రెడ్డి, జగదీష్‌, వెంకటే్‌సగౌడ్‌, మహేందర్‌, ఆంజనేయులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-02T23:42:29+05:30 IST
Read more