ఎమ్మెల్సీ, జడ్పీ చైర్‌పర్సన్‌ను కలిసిన నాయకులు

ABN , First Publish Date - 2022-07-18T05:30:00+05:30 IST

ఎమ్మెల్సీ, జడ్పీ చైర్‌పర్సన్‌ను కలిసిన నాయకులు

ఎమ్మెల్సీ, జడ్పీ చైర్‌పర్సన్‌ను కలిసిన నాయకులు
ఎమ్మెల్సీ, జెడ్పీ చైర్‌పర్సన్‌ను కలిసిన తాండూరు పట్టణ టీఆర్‌ఎస్‌ నాయకులు

తాండూరు/బషీరాబాద్‌, జూలై 18 : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, వికారాబాద్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డిని తాండూరు పట్టణ టీఆర్‌ఎస్‌ నాయకులు సోమవారం హైదరాబాద్‌లోని వారి నివాసంలో కలిశారు. ఎల్లప్పుడూ మీవెంటే ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న, టీఆర్‌ఎస్‌ పట్టణ మాజీ అధ్యక్షుడు అబ్దుల్‌ రవూఫ్‌, ఆర్టీఏ డైరెక్టర్‌ జావెద్‌, కౌన్సిలర్లు శోభారాణి, రత్నమాల, సల్మాఫాతిమా, రాము, కో-ఆప్షన్‌ సభ్యులు తదితరులు కలిశారు. అదేవిధంగా బషీరాబాద్‌ మండల ఏఎంసీ మాజీ వైస్‌చైర్మన్‌ పి.మాణిక్‌రెడ్డి, పలువురు నాయకులు కలిశారు. వీరితోపాటు మాజీ ఎంపీటీసీ హరిసూధన్‌రెడ్డి, గిరిజాపురం నర్సిరెడ్డి, మల్లికార్జున్‌, నారాయణరెడ్డి, యాదవరెడ్డి, పి.సుదర్శన్‌రెడ్డి జడ్పీచైర్‌పర్సన్‌ను కలిశారు.

Read more