పీఏసీఎస్‌లో భూవేలాన్ని నిలిపివేయాలి

ABN , First Publish Date - 2022-03-04T05:39:01+05:30 IST

పీఏసీఎస్‌లో భూవేలాన్ని నిలిపివేయాలి

పీఏసీఎస్‌లో భూవేలాన్ని నిలిపివేయాలి
వినతిపత్రం అందజేస్తున్న సీపీఎం నాయకులు

మంచాల, మార్చి 3: ప్రాథమిక వ్యవసాయ సహకార బ్యాంకులో  భూముల వేలాన్ని నిలిపివేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు పి.యాదయ్య అధికారులను కోరారు. గురువారం పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి మంచాల పీఏసీఎస్‌ చైర్మన్‌కు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ రైతులకు చెందిన దీర్ఘకాలిక రుణాలకు సంబందించి వాణిజ్య బ్యాంకుల్లో వన్‌టైమ్‌ సెటిల్మెంట్‌ అవకాశం కల్పిస్తోందన్నారు. రైతులకు చెందిన సహకార బ్యాంకులో అవకాశం ఇవ్వకపోగా రైతులకు చెందిన భూములను వేలం వేస్తామనడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. దీనిపై సంబంధిత అధికారులు సమీక్ష నిర్వహించి అన్నదాతలకు రుణవిముక్తులు కావడానికి వన్‌టైమ్‌ సెటిల్మెంట్‌ వెసులుబాటు కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి శ్యాంసుందర్‌, జిల్లాకమిటీ సభ్యుడు కె.శ్రీనివా్‌సరెడ్డి, రావులజంగయ్య, ఎంపీటీసీ ఎల్‌.చంద్రశేఖర్‌రెడ్డి, బెల్లిపాండు, బి.ఐలయ్య, చంద్రయ్య పాల్గొన్నారు. 

Read more