కొడంగల్‌ సీఐకి సన్మానం

ABN , First Publish Date - 2022-10-09T04:56:44+05:30 IST

కొడంగల్‌ సీఐకి సన్మానం

కొడంగల్‌ సీఐకి సన్మానం

కొడంగల్‌ రూరల్‌, అక్టోబరు 8: కొడంగల్‌ పోలీస్‌స్టేషన్‌లో నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించిన బి.శంకర్‌ను ఎంఐఎం తాలూకా అధ్యక్షుడు ఎస్బీ గుల్షన్‌ ఆధ్వర్యంలో సన్మానించారు. శనివారం స్థానిక పీఎస్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పూలమాలలు, శాలువాలతో సీఐని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎండీ. సర్తాజ్‌ హుసేన్‌, ఎండీ.అశ్వాఖ్‌అలీ, ఎండీ.అర్షద్‌హుసేన్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే బీసీ సంక్షేమ సంఘం వికారాబాద్‌ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రవీంద్రచారి, కాంగ్రెస్‌ నాయకులు గుండ్లకుంట రాము, సయ్యద్‌ అశ్వాక్‌, సాయికృష్ణ తదితరులు సీఐని సన్మానించారు. 


Read more