కోలాటమేసిన కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-09-30T04:56:35+05:30 IST

దసరా నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా జిల్లా కలెక్టరేట్‌లో

కోలాటమేసిన కలెక్టర్‌
బతుకమ్మల వద్ద కోలాటమాడుతున్న జిల్లా కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌, మహిళా ఉద్యోగులు

రంగారెడ్డి అర్బన్‌, సెప్టెంబరు 29 : దసరా నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా జిల్లా కలెక్టరేట్‌లో బతుకమ్మ సంబరాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ పాల్గొని మహిళా ఉద్యోగులతో కలిసి కోలాటమాడారు. అనంతరం వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా కలెక్టర్‌ వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో జిల్లా శిశుసంక్షేమాధికారి మోతి, ఏవో ప్రమీల, జిల్లా అధికారులు పాల్గొన్నారు. Read more